తెలంగాణ

స్ఫూర్తిదాయకం.. రాష్ట్ర అటవీ సంరక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: తెలంగాణ ప్రభుత్వం అటవీ సంరక్షణ కోసం తీసుకున్న చర్యలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డ్ చైర్మన్ డాక్టర్ బీఎంకే రెడ్డి శ్లాఘించారు. తెలంగాణ అటవీ శాఖ చేపట్టిపన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను పరిశీలించేందుకు సోమవారం హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఏపీ ప్రభుత్వం కూడా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రత్యేక చర్యలు తీసుకున్నామని బీఎంకె రెడ్డి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం అటవీ సంరక్షణకు తీసుకున్న చర్యలపై ఈ సందర్భంగా తెలంగాణ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ (హెచ్‌ఓఎఫ్‌ఎఫ్) ఆర్. శోభ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణకు హరితహారం విశిష్టత గురించి వివరించారు. జంగల్ బచావో-జంగల్ బడావో నినాదాన్ని తీసుకుని గత ఐదేళ్లలో విస్తృతమైన చర్యలను తీసుకున్నామన్నారు. అడవుల సహజ పునరుద్దరణకు, అటవీప్రాంతాల రక్షణకు కందకాల ఏర్పాటు చేశామని, పెద్ద ఎత్తున అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేశామన్నారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో మొక్కల పెంపకానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు శోభ వివరించారు. ఈ సమావేశంలో అదనపు పీసీసీఎఫ్‌లు లోకేష్ జైస్వాల్, ఎంసీ పర్గెయిన్, సిద్దానంద్ కుక్రేటీ, డిప్యూటీ కన్జర్వేటర్ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న శోభ