తెలంగాణ

వింటేజ్ కార్ ర్యాలీలో జాన్ మోరిస్ ఫైర్ ఇంజన్ పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: పాత తరం జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి అప్పుడప్పుడు ఆనాటి వాహనాలను ప్రజల ముందుకు తీసుకువస్తుంటారు. ఇందులో భాగంగా 1914లో (హెచ్‌ఇహెచ్) నిజాం స్టేట్ రైల్వేలో జాన్ మోరిస్ ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉండేది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో జాన్ మోరిస్ ఫైర్ ఇంజన్ అందరినీ ఆకట్టుకుంది. ఈనెల 23న ఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక స్టేట్స్‌మెన్ వింటేజ్, క్లాసిక్ కార్ ర్యాలీని జెఎంఏఐ సంస్థ ఏర్పాటు చేసింది. 54వ స్టేట్స్‌మన్ వింటేజ్ కార్ ర్యాలీలో నిజాం నాటి వింటేజ్ జాన్ మోరిస్ ఫైర్ ఇంజన్ 70 కిమీ దూరాన్ని ప్రయాణించింది. ర్యాలీలో పాల్గొన్న అత్యంత పురాతన ఫైర్ ఇంజన్ ఇదే. 106 సంవత్సరాల వయస్సు ఉన్న ఏకైక వాహనం జాన్ మోరిస్ ఫైర్ ఇంజన్. 13 సంవత్సరాల తర్వాత మళ్లీ ఢిల్లీ ర్యాలీలో ఈ ఇంజన్ ప్రదర్శనలో నిలిచింది. జాన్ మోరిస్ ఫైర్ ఇంజన్ వెనకున్న కథ ఎంతో ఆశ్చర్యపర్చుతుంది. ప్రపంచంలో ఒరిజనల్ ష్రూస్‌బరి, చాలెంజర్ సాలిడ్ టైర్లు, ఒరిజనల్ అగ్నిమాపక పరికరాలతో ఏర్పాటుచేసిన వాహనమిది. అగ్నిమాపక పరికరాల్లో ఎజాక్స్‌గన్- మెటల్ టర్‌బైన్ పంప్ ఉంది. ఆనాటి ఈ వాహనాన్ని మళ్లీ రహదారిపై నడిపించడానికి దక్షిణ మధ్య రైల్వే లాలగూడ క్యారేజ్ వర్క్‌షాప్ సాంకేతిక సిబ్బంది కృషి చేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీ రైల్వే మ్యూజియంలో ఈ ఇంజన్‌ను సందర్శన కోసం ఉంచారు. ట్రోఫీ గెలుచుకోవడానికి ఇంజన్‌కు మరమ్మతులు చేసిన టెక్నికల్ ఉద్యోగులను దక్షిణ మధ్య రైల్వే జోన్ జీఎం గజానన్ అభినందించారు.
*చిత్రం... ఢిల్లీలో వింటేజ్ క్లాసిక్ కార్ ర్యాలీలో ట్రోఫీ గెలుచుకున్న
1914 నిజాం స్టేట్ రైల్వేలో పనిచేసిన వింటేజ్ జాన్ మోరిస్ ఫైర్ ఇంజన్