ఆంధ్రప్రదేశ్‌

శోక సంద్రంలో విశాఖ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 22: చెన్నై నుంచి పోర్టు బ్లెయిర్‌కు వెళ్తున్న వాయుసేన విమానం (ఎఎన్ 32) అదృశ్యమైన ఘటనలో విశాఖ నేవల్ ఆర్మ్‌డ్ డిపో (ఎన్‌ఎడి)కి చెందిన సిబ్బంది ఎనిమిదిమంది ఉన్నారు. ఎన్‌ఎడిలో టెక్నీషియన్లుగా పనిచేస్తున్న బి సాంబమూర్తి(్ఛర్జ్‌మెన్), భూపేంద్ర సింగ్ (ఎగ్జామినర్), పి నాగేంద్రరావు, ఆర్‌వి ప్రసాదబాబు, సేనాపతి పూర్ణచంద్ర, శిరీన్ మహరాణ (ఆర్న్‌మెంట్ ఫిట్టర్), ఎన్ చిన్నారావు, జి శ్రీనివాస్ (మల్టీటాస్కింగ్ స్ట్ఫా) ఉన్నారు. వీరంతా విధి నిర్వహణలో భాగంగా బుధవారమే విశాఖ నుంచి బయలుదేరారు. గురువారం చెన్నై చేరుకున్నారు. శుక్రవారం ఉదయం వాయుసేన విమానంలో వీరంతా పోర్టు బ్లెయిర్‌కు బయలుదేరారు. అయితే, వీరు ప్రయాణిస్తున్న విమానం గల్లంతైన విషయం ఎన్‌ఎడి అధికారుల ద్వారా కుంటుంబీకులు తెలుసుకున్నారు. దీంతో వారు పెను విషాదంలో మునిగిపోయారు. విశాఖ నగరం గోపాలపట్నం, అప్పన్నపాలెం, బుచ్చిరాజుపాలెం, వేపగుంట ప్రాంతాలకు చెందిన వీరు ఈ నెల 20న విధి నిర్వహణలో భాగంగా పోర్టు బ్లెయిర్‌కు బయలుదేరారు. బుధవారం ఉదయం ఇంటినుంచి బయలుదేరిన వీరిని కుటుంబీకులు ఆనందంగా సాగనంపారు. గురువారం ఉదయం చెన్నై చేరుకున్న సిబ్బంది తమ తమ కుటుంబీకులతో క్షేమంగా చేరినట్టు సమాచారం అందించారు. తన భర్త గంట్ల శ్రీనివాస్ చెన్నైనుంచి గురువారం మధ్యాహ్నం తనతో ఎంతో ఉల్లాసంగా మాట్లాడారని అతని భార్య ఈశ్వరమ్మ చెప్పారు. 24 గంటలు గడిచేసరికి తన భర్త పనిచేస్తున్న సంస్థకు చెందిన ఉద్యోగులు వచ్చి విమానం గల్లంతైన విషయాన్ని చెప్పారని బోరున విలపిస్తూ తెలిపింది.
బుచ్చిరాజుపాలెం ప్రాంతానికి చెందిన చిన్నారావు ప్రయాణిస్తున్న విమానం గల్లంతైందన్న సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గురువారం ఉదయం క్షేమంగా చెన్నై చేరుకున్నట్టు తెలిపిన భర్త ఇంతలోనే దూరమవుతాడని ఊహించలేదని భార్య పైడికొండ విలపిస్తూ చెప్పింది. విధి నిర్వహణలో భాగంగా కొన్ని సందర్భాల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లడం సహజమేనని, అయితే, ఈ సారి విమానంలో వెళ్లారని తెలిపింది. చెన్నై క్షేమంగా చేరినట్టు చెప్పారని తెలిపింది.