తెలంగాణ

గురుకుల విద్యాలయాల్లో 2,444 పోస్టుల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: గురుకుల విద్యాలయాల్లో బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. ఇప్పటి వరకు తమకు వివిధ విద్యాలయాల నుంచి అందిన సమాచారం మేరకు 2,444 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు శుక్రవారం ఆయన మీడియాకు వెల్లడించారు. భర్తీ చేయబోయే వాటిలో జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ కాలేజీల లెక్చరర్ పోస్టులతో పాటు లైబ్రరీయన్, అడ్మినిస్ట్రేషన్ స్ట్ఫా పోస్టులు ఉన్నాయని ఆయన తెలిపారు. వీటి కి సంబంధించిన రోస్టర్, సిలబస్ తదితర అంశాలను పరిశీలిస్తున్నామని, వచ్చే నెల మొదటి వారానికి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు.