తెలంగాణ

పౌర చట్టంపై తప్పుడు ప్రచారం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 1: దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న అల్లర్లపై సోషల్ మీడియాను అరాచక శక్తులు పుకార్ల ప్రచారానికి వాడుకున్నాయని, ఇలాంటి తప్పుడు సమాచారానికి సోషల్ మీడియా సాధనం కాకూడదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి అన్నారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం ద్వారా ఏ భారతీయుడి పౌరసత్వాన్నీ హరించడం లేదని, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లో హింసకు గురైన మతపరమైన మైనారిటీలకు పౌరసత్వం ఇవ్వడం మాత్రమే చట్టం ఉద్దేశ్యమని ఆయన అన్నారు. ఆదివారం ఇక్కడ ఆయన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఐఎస్‌బీ పాలసీపై ఐడియాస్ ఫర్ ఇండియా 2020 బియాండ్ అనే కానె్సప్ట్‌పై జరిగిన సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ గత ఐదున్నర సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రారంభించిన సంక్షేమ పథకాలపై చర్చించాలన్నారు. భారతదేశ భవిష్యత్తును మార్చే విధంగా
శాంతి భద్రతలను రక్షించేలా, పేదరికాన్ని నిర్మూలించడానికి, మెరుగైన ఆరోగ్యాన్ని అందించే విదంగా కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని ఆయన యువతను కోరారు. ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారానే మంచి ఫలితాలను రాబట్టగలమని, ప్రజలు రాజకీయాల గురించి కాకుండా ప్రాధాన్యత కలిగిన విషయలపై చర్చించాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం కొత్త ఆలోచనలు చేయడం ద్వారా ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ, జనధన్ యోజన, ఆర్టికల్ 370ను రద్దు చేయడం, దేశ ముఖాన్ని మార్చిన కొత్త ఆలోచనలు అని ఆయన చెప్పారు. దేశం అభివృద్ధికి స్థిరమైన విధాన రూపకల్పన అవసరమన్నారు. బాధ్యాతాయుతమైన మీడియా, ఫిల్మ్ మేకింగ్, సెన్సార్‌షిప్‌పై మరింత చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. నూతన ఆలోచనచలు, ఆవిష్కరణ అవసరాన్ని తెలియజేస్తూ 2024 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడం మన లక్ష్యమన్నారు. ఇలాంటి చర్చలు, సమావేశాలతో లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమవుతుందన్నారు. ఐఎస్‌బీ ప్రతిపాదించిన కానె్సప్ట్ భారతీయ సమాజంలోని విభిన్న అంశాలను ముందుకు సాగేలా సహాయపడాలని లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. రాబోయే రోజుల్లో భారత్ సూపర్ పవర్ దేశంగా అవతరిస్తుందన్నారు. ఆర్థికాభివృద్థి ద్వారా వచ్చిన మార్పులు సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం అవసరమన్నారు.

*చిత్రం... ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఆదివారం జరిగిన సదస్సును ప్రారంభించిన అనంతరం మాట్లాడుతున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి