తెలంగాణ

మాటల సీఎం కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మార్చి 1: మాటల సీఎం కేసీఆర్ అని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో బాధిత మహిళలతో కలిసి ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరేళ్ల పాలనలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించా రు. గత ప్రభుత్వాలు నిర్మించిన ఇళ్లకు రంగులు వేసి ప్రజలకు అందించారని పేర్కొన్నారు. నాబార్డ్ బ్యాంక్ నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. రాష్ట్రం అనుసరిస్తున్న బాధ్యతారాహిత్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర రాజధానిలో పేదలు దయనీయమైన జీవితాలను
అనుభవిస్తున్నారని వాపోయారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టిస్తామని చెప్పి ఉన్న ఇళ్లను కూల్చివేసి పేదలకు గూడు లేకుండా చేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వం అద్భుతమైన ఇళ్లను నిర్మించి ఇస్తుందన్న ఆశ పడ్డ పేదలకు తీవ్ర నిరాశే మిగిలిందని అన్నారు. అద్దెలు చెల్లించి కిరాయి ఇళ్లలో ఉండలేక పోతున్నామని మొరపెట్టుకున్నా వినిపించుకునే నాథుడే కరువు అయ్యాడని అన్నారు. పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను సైతం మళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్‌టీఆర్, చంద్రబాబు, వైఎస్సార్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక్క హామీ ఇస్తే సాయంత్రానికల్లా జీఓలు జారీ అయ్యేవని, ప్రస్తుతం ముఖ్యమంత్రి మాటలు నీటి మూటలకే పరిమితం అవుతున్నాయని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తున్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించక పోవడంతో రాష్టవ్య్రాప్తంగా ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయని తెలిపారు. పట్టణ గోస కార్యక్రమంలో మల్కాజిగిరి నియోజకవర్గంలో పర్యటించగా అనేకమంది పేదలు తమ సమస్యలు విన్నవించుకుంటూ కంటతడిపెట్టుకున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం అంటూ ప్రవేశపెట్టిన డబుల్ ఇళ్లను ఇవ్వక పోవడంతో పేదలు నరకయాతన అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ఎక్కడి బస్తీవాసులకు అక్కడే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించి యుద్ధప్రాతిపాదికన ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ లోపు పేదలకు న్యాయం జరగకపోతే ప్రజా పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. ముఖ్యంగా పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. కేసీఆర్ పేదల దేవుడు అన్నారని, మరి ఆరేళ్లయినా పేదల కష్టాలు ఎందుకు తీర్చడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 26 లక్షలు, హైదరాబాద్‌లో 10 లక్షలు, కేవలం మల్కాజిగిరి పరిధిలో ఆరు లక్షల మంది ఇళ్లు లేని వారున్నారన్నారు. ఏప్రిల్ లోపు ప్రారంభించాల్సిన ఇళ్లను ప్రభుత్వం లబ్ధిదారులకు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు తమ గోడును మీడియా ముందు వెళ్లబోసుకున్నారు.

*చిత్రం... జూబ్లీహిల్స్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బాధిత మహిళలతో కలిసి మాట్లాడుతున్న మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి