తెలంగాణ

ఆందోళన బాటలో పాలమూరు నిర్వాసితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మార్చి 1: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన కొనసాగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగా పాలమూరు ప్రాజెక్టు పరిధిలోని ఉదండాపూర్ జలాశయం నిర్వాసితులు తమకు పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని మార్కెట్‌కు అనుగుణంగా పరిహారం ఇవ్వాలంటూ ఆందోళన బాటపట్టారు. ఆందోళన బాటపట్టడంతో పాటు వారు జలాశయం పనులను అడ్డుకున్నారు. గత ఐదురోజుల నుండి వారి ఆందోళన కొనసాగుతోంది. ఆదివారం సైతం వల్లూరు దగ్గర నిర్వాసితులు ధర్నాకు దిగారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో పాలమూరు ప్రాజెక్టు పరిధిలోని ఉదండాపూర్ రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారు. అయితే నిర్వాసితులు పనులను అడ్డుకోవడంతో ప్రస్తుతం పనులు నిలిచిపోయాయి. న్యాయమైన పరిహారం అందించాలనే డిమాండ్‌తో ఆందోళనకు దిగారు. దాంతో పనులు నిలిచిపోవడంతో అధికారులు నిర్వాసితులతో చర్చించినా ఫలితం లేకపోయింది. ఈ జలాశయం కోసం 2016లో ఖానాపూర్, వల్లూరు, ఉదండాపూర్, పోలెపల్లి, కిష్టారం గ్రామాల పరిధిలో 4094 ఎకరాలు, వివిధ కారణాల వల్ల ఇంకా 884 ఎకరాల సేకరణ చేపట్టలేదు. సాధారణ వ్యవసాయ భూమికి ఎకరానికి రూ.5.50 లక్షలు, మాగాణికి రూ.6.50 లక్షలు కేటాయించి పరిహారం అందజేశారు. తాజాగా పోలెపల్లి పరిధిలోని భూములు కోల్పోయే వారికి ప్రభుత్వం పరిహారం ఇవ్వడానికి సిద్ధమైంది. అక్కడి మార్కెట్ విలువ ప్రకారం ఎకరాకు సాధారణ వ్యవసాయానికి రూ.11.50 లక్షలు కాగా మాగాణికి రూ.12.50 లక్షలు పరిహారం నిర్ణయించారు. దీంతో భూములు కోల్పోయిన మిగతా గ్రామాల నిర్వాసితులు తమకు కూడా పోలెపల్లి తరహాలో పరిహారం ఇవ్వాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. అయితే నిర్వాసితులు మాత్రం ఆందోళన చేస్తూ తమకు ప్రభుత్వం ఇస్తానన్న ఇళ్ల స్థలాలు సైతం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. వల్లూరు, ఉదండాపూర్ గ్రామాల భూ నిర్వాసితులు ప్రత్యేకంగా ధర్నా చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ప్రకటించిన పరిహారంతో మరోచోట స్థలం కూడా తీసుకోలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉదండాపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితులు చేపడుతున్న ఆందోళనపై అధికారులు స్పదించినా ఫలితం దక్కడంలేదు. తమకు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆప్పుడే తాము ఆందోళన విరమిస్తామని చెబుతున్నారు. కాగా ఉదండాపూర్ జలాశయం పరిధిలో 30 మందికి మాత్రమే పరిహారం రావాల్సి ఉందని ఇప్పటికే ఉన్నతాధికారులకు తహశీల్దార్ లక్ష్మినారాయణ నివేదిక పంపారు. ఈ నివేదికపై ప్రభుత్వం సైతం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పరిహారం అందని 30 మందికి మాత్రం ఆన్‌లైన్ ద్వారా పంపిణీ చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నట్టు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించినట్టు సమాచారం.
*చిత్రం... మహబూబ్‌నగర్ జిల్లా వల్లూరు గ్రామంలో ధర్నాకు దిగిన ఉదండాపూర్ జలాశయం నిర్వాసితులు