తెలంగాణ

కరోనాపై రెడ్ అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తికి ‘కరోనా’ సోకినట్టు నిర్థారణ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ఎట్టిపరిస్థితిలోనూ కరోనా వైరస్ ఇతరులకు విస్తరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇందుకోసం నిధులు ఎంత అవసరమున్నా విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి ఈటల రాజేందర్ సోమవారం ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి క్షుణ్ణంగా చర్చించారు. ఆ తర్వాత మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే తెలంగాణకు చెందిన 24 సంవత్సరాల యువకుడికి కరోనా వ్యాధి సోకినట్టు నిర్థారణ అయిందని వెల్లడించారు. కరోనా సోకిన యువకుడికి గాంధీ దవాఖానాలో చికిత్స చేస్తున్నామని, అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన వివరించారు. కరోనా సోకిన యువకుడు ఫిబ్రవరి 17న దుబాయి వెళ్లి, నాలుగు రోజులపాటు హాంకాంగ్ వ్యక్తులతో డ్యూటీకి సంబంధించి పనిచేశాడని ఆయన తెలిపారు. బెంగళూరు నుండి బస్సులో హైదరాబాద్ వచ్చాడని, తొలుత అతడికి అపో దవాఖానాలో చికిత్స జరిగిందన్నారు. ఆ తర్వాత అతడిని గాంధీ దవాఖానాకు తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచామన్నారు. అతడిని పరీక్షించి, నమూనాలను పుణెకు పరీక్షల కోసం పంపిస్తే కరోనా పాజిటివ్ అని తేలిందన్నారు. దాంతో అతడితోపాటు బెంగళూరు నుండి హైదరాబాద్ బస్సులో ప్రయాణించిన 27 మందిని, వారి కుటుంబాలకు చెందిన 80 మందికి పరీక్షలు నిర్వహించామన్నారు. గాంధీ, చెస్ట్, ఫీవర్ దవాఖానాల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని వైద్య మంత్రి ప్రజలకు సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో దగ్గడం, తుమ్మడం లాంటివి చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు బ్రోచర్లు ప్రింట్ చేసి ప్రజలకు అందిస్తామన్నారు.

ఇవీ
జాగ్రత్తలు..
జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి తదితర లక్షణాలుంటే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి.
ప్రజలు ఎక్కువ మం ది గుమికూడే ప్రదేశాలకు వెళ్లకుండా ఉంటే మంచిది.
దూరప్రాంత ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి.
అపరిచితులకు దూ రంగా ఉండడం మంచిది.
పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు చలిప్రదేశాల్లో తిరగకూడదు.
పెంపుడు జంతువుల కు దూరంగా ఉండాలి.
తుమ్మినా, దగ్గినా బట్ట ఏదైనా ముక్కుకు, నోటికి అడ్డుగా పెట్టుకోవాలి.
ఆరుబయటకు వెళ్లేవా రు మాస్క్ ధరిస్తే మంచిది.

*చిత్రం...వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సోమవారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఈటల రాజేందర్