తెలంగాణ

ప్రజాసమస్యలు చర్చించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: రానున్న అసెంబ్లీ బడ్జెట్ బడ్జెట్ సమావేశాల్లో అనేక ప్రజాసమస్యలు చర్చించాల్సి ఉందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఆయన ఒక వినతిపత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచారికి అందజేశారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, దౌర్జన్యాలు, రైతుల ఆత్మహత్యలు, రైతుబంధు పంపిణీ, కిసాన్ సమ్మాన్ యోజన పథకం అమలు , నీటిపారుదల ప్రాజెక్టులు, నిర్మాణం స్థితి గతులు, వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపు వంటి అనేక సమస్యలున్నాయని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల దయనీయస్థితి, రాజధానిలో అక్రమ నిర్మాణాలు, భవనాల మాస్టర్ ప్లాన్, నూతన సచివాలయ నిర్మాణం, మిషన్ భగీరథ, పీఆర్‌సీ చెల్లింపు, స్థానిక సంస్థలకు బడ్జెట్ కేటాయింపులు, కేంద్ర నిధుల సద్వినియోగం, ఎంఎంటీఎస్ రెండో దశ జాప్యంపైనా అసెంబ్లీలో చర్చించాలని సూచించారు.