తెలంగాణ

సింగరేణిలో వందశాతం థర్మల్ విద్యుత్ ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: సింగరేణితో పాటు దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ అవసరాలు తీర్చుతున్న సింగరేణి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం (మంచిర్యాల జైపూర్) మరోసారి తన ప్రతిభను చాటిచెప్పింది. ఫిబ్రవరి నెల విద్యుత్ ఉత్పత్తి పరిశీలిస్తే వందశాతం (ప్లాంట్ లోడ్ ప్యాక్టర్) విద్యుత్ ఉత్పత్తి జరిగింది. దీంతో స్టేషన్‌లో పీఎల్‌ఎఫ్ 100.18 శాతం ఉత్పత్తి సాధించింది. ఫిబ్రవరి నెలలో విద్యుత్ ప్లాంట్‌లో 836.70 మిలియన్ల యూనిట్లు ఉత్పత్తి చేయగా, సింగరేణి అవసరాలకు పోను మిగిలిన 791.79 మిలియన్ల యూనిట్లు విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేసింది. 2020 జనవరి నుంచి నేటి వరకు 8.398 మిలియన్ల యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేయగా 7,895 మిలియన్ల యూనిట్ల విద్యుత్‌ను తెలంగాణ అవసరాల కోసం పంపిణీ చేసింది. థర్మల్ విద్యుత్ ఉద్యోగుల పని తీరును ప్రశంసిస్తూ సంస్థ సీఎండీ శ్రీ్ధర్ అభినందించారు.