తెలంగాణ

కందుల కొనుగోళ్లపై పరిమితి ఎత్తివేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పండించిన పంటను అమ్ముకోవడానికి రైతన్నలు నానా తంటాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయ రంగం నిర్లక్ష్యానికి గురి అవుతుందని విమర్శించారు. సోమవారం హాకా భవన్‌లో వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డిని టీపీసీసీ తరఫున సంపత్‌కుమార్, కోదండరెడ్డి కలిసి వినతి పత్రం సమర్పించారు. కంది రైతులు రోడ్లలపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు లేదని అన్నారు. మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ రంజిత్‌రెడ్డిల వ్యాపారం కోసం చికెన్ కొనుగోళ్లు పడిపోకుండా స్పందించిన మంత్రి కేటీఆర్ రైతుల సమస్యలపై స్పందించరా? అని సంపత్‌కుమార్ ప్రశ్నించారు. కంది రైతులను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. టమాటా రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందన్నారు. మార్కెట్‌లో కంది కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం పరిమితి విధించటం సరికాదన్నారు. కంది కొనుగోళ్లకు పరిమితి ఎత్తివేయాలని, టమాటా రైతులకు మద్దతు ధర కల్పించాలని మంత్రిని కోరినట్టు సంపత్‌కుమార్ మీడియాకు వివరించారు.
కాంగ్రెస్ హయాంలో వ్యవసాయ పనిముట్లకు ఇచ్చిన సబ్సిడీని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎత్తివేసిందని విమర్శించారు. వ్యవసాయ పనిముట్లు అంటే కేవలం ట్రాక్టర్ల మాత్రమే కాదన్నారు. రైతుల సమస్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లోనైనా స్పందిస్తాడని ట్విట్ చేసినా స్పందన లేదని సంపత్‌కుమార్ విమర్శించారు.