తెలంగాణ

రిటైర్డ్ సీఎస్ మోహన్ కందాతో ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: తెలంగాణలో అమలు జరుగుతున్న వివిధ రంగాల అభివృద్ధి పనులపై మాజీ చీఫ్ సెక్రటరీ మోహనకందాతో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్‌కుమార్ భేటీ అయ్యారు. రాష్ట్ర సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రాధాన్య రంగాల్లో వృద్ధిపై సమాలోచనలు చేశారు. ముఖ్యంగా వ్యవసాయం, సహకార, నీటిపారుదల, విద్యుత్ రంగాల్లో పురోగతిపై వారు చర్చించారు. కాళేశ్వరం, మిడ్‌మానేరు, శ్రీరాంసాగర్ వంటి సాగునీటి ప్రాజెక్టుల ద్వారా బీడు భూములను సస్యశ్యామలం చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న అంశాలను కందాకు వివరించారు. రానున్న రోజుల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తోందన్నారు. రైతు బంధు పక్కాగా అమలు చేయడంతో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిల్చిందన్నారు. ఈ సందర్భంగా కందా మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న పనుల్లో విప్లవాత్మక మార్పులు జరగాలన్నారు. సహకార రంగాల్లో వౌలిక, నిర్మాణాత్మక మార్పులు జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు అత్యవసరం అన్నారు. దీంతో రైతులు ఎదుర్కొంటున్న మార్కెటింగ్ సమస్యలు పరిష్కారం అవుతాయని కందా ఆశాభావం వ్యక్తం చేశారు.
సాగునీటి వనరులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడంతో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. రైతులు పంటలు పండించే వాతావరణ తెలంగాణలో నెలకొనడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. వ్యవసాయ బతుకుదెరువు కోణం నుంచి వాణిజ్య రంగాల్లోకి రైతులను తీసుకుపోవాలన్నారు. తద్వారా రైతులు బలోపేతం అవుతారన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో ప్రణాళిక సంఘం ముఖ్యపాత్ర అత్యంత కీలకమన్నారు. అన్ని శాఖల దిశానిర్దేశం చేయాల్సిన గురుతర బాధ్యత ప్రణాళిక సంఘానిదే అని కందా నొక్కి చెప్పారు.

*చిత్రం... మాజీ సీఎస్ మోహన్ కందాతో వినోద్‌కుమార్