తెలంగాణ

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పట్టించుకోరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పట్టించుకోరా అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నిలదీశారు. ఈ మేరకు ఆయన సీఎంకు ఒక లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే పీఆర్‌సీ అమలు చేయాలని, కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం వర్తింప చేయాలని అన్నారు. ఉద్యోగ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచాలని తమ్మినేని కోరారు. ఉద్యోగుల 10వ పీఆర్సీ గడువు ముగిసి సుమారు సంవత్సరం దాటిపోయిందని, 2018 జూన్ 2 నుండి ఇంటీరియం రిలీఫ్, ఆగస్టు 15 నుండి రాష్ట్రంలో మొదటి పీఆర్‌సీ అమలుచేస్తామని చెప్పారు. కాంట్రాక్టు అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులను రెగ్యులర్ చేయడానికి ఇచ్చిన జీవో 16 ఇప్పటికే కోర్టులో పెండింగ్‌లో ఉందని అన్నారు. రెగ్యులర్ చేయడం ఆలస్యమైనా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వీరికి పూర్తి జీతం చెల్లించడానికి ఎలాంటి ఆటంకాలు లేవని అన్నారు. కనుక ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకుని పూర్తి జీతం చెల్లించేందుకు తగిన చర్యలు చేపట్టాలని చెప్పారు. నేషనల్ పెన్షన్ స్కీం సీపీఎస్ గత 15 సంవత్సరాల నుండి అమలు అవుతోందని, ఈ స్కీమ్‌లో ఉన్న వారికి రిటైరైన తర్వాత కనీస పెన్షన్ విధానంలో చెల్లించే పెన్షన్ కంటే తక్కువగా వస్తోందని అన్నారు. కనుక సీపీఎస్ స్కీమ్‌లో రిటైరైన వారికి కనీస పెన్షన్‌కు తగ్గకుండా చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సూచించారు. మరణించిన ఉద్యోగి కుటుంబానికి పాత పెన్షన్ విధానంలో కుటుంబ పెన్షన్ తగ్గకుండా చూడాలని అన్నారు. ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్ దీర్ఘకాలంగా పరిష్కరించలేదని, చిన్న చిన్న సాంకేతిక సమస్యలతోనే కోర్టుల్లో సంవత్సరాల తరబడి కొనసాగుతోందని అన్నారు. కొత్త జోన్స్ ఏర్పాటు చేస్తూ రాష్టప్రతి జారీ చేసిన ఉత్తర్వులపై కొందరు ఉపాధ్యాయులు స్టే తెచ్చుకోవడంతో , పాఠశాల విద్యాశాఖలో 2015 జూలై నుండి నేటి వరకూ పదోన్నతులు కల్పించలేదని అన్నారు.
2017 లో, 2019లో అప్ గ్రేడ్ చేసిన పండిట్, పీఈటీ పోస్టులకు కూడా పదోన్నతులు కల్పించలేదని, దీనిపై ప్రభుత్వం వెంటనే కౌంటర్ దాఖలు చేసి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని అన్నారు.