తెలంగాణ

14మంది బాల కార్మికులకు విముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: గుట్టుచప్పుడు కాకుండా బాలకార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్న గాజుల పరిశ్రమ యజమానులను అరెస్టు చేసి దాదాపు 14 మంది బాల కార్మికులకు పోలీసులు విముక్తి కలిగించారు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ తమకు తెలియని చోట కొద్దిపాటి డబ్బుల కోసం ఈ చిన్నారులు పడే బాధలు వర్ణనాతీతం. అభం శుభం తెలియని చిన్నారులను రూమ్‌లో సరిగ్గా వెలుతురు, గాలి చొరబడని టోట వీరితో వెట్టిచాకిరీ చేయిస్తూ, అరోగ్యానికి హాని కలిగించే విష పూరిత రసాయనాలతో గాజుల తయరీ చేస్తున్న బాలల పట్ల ప్రతి ఒక్కరికి జాలి కలుగక తప్పదు. గాజుల ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు అత్యధికంగా ఊపిరితిత్తులు పాడై అనేక రకాల చర్మ వ్యాధుల బారిన పడుతున్నారు. పాతబస్తీ ఛత్రినాకలోని రాఘవేంద్ర కాలనీ, పటేల్‌నగర్‌లో గాజుల ఫ్యాక్టరీని బిహార్ రాష్ట్రానికి చెందిన తరుణ్ చౌదరి, సుంతుష్ మంగి నడుపుతున్నారు. సోమవారం దక్షిణ మండలం టాస్క్ఫోర్స్, కార్మిక శాఖ అధికారులతో పాటు స్థానిక ఛత్రినాక పోలీసులు కలిసి గాజుల ఫ్యాక్టరీపై దాడి చేసి సోదాలు నిర్వహించారు. గాజుల ఫ్యాక్టరీ నడుపుతున్న తరుణ్ చౌదరి, సుంతుష్ మంగిలు కలిసి తమ స్థానిక గ్రామాల నుండి పిల్లలను తీసుకువచ్చి పనులు చేయించుకోవాలని ప్రణాళికను రూపొందించారు. ఇందులో భాగంగా చిన్న పిల్లలను పనిలో పెట్టుకోవడం.. వారి తల్లిదండ్రులకు ప్రతి నెల రూ. ఐదు వేల చొప్పున చెల్లిస్తామని నమ్మబలికి పిల్లలను బలవంతంగా తీసుకువచ్చి పనిచేయిస్తున్నారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న తెలంగాణ కార్మిక శాఖ అధికారులు, దక్షిణ మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు, ఛత్రినాక పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. గాజుల తయారీ యూనిట్లలో పనిచేస్తున్న 14 మంది పిల్లలను రక్షించి చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారులకు సమాచారం అందించి తదుపరి చర్యల కోసం ఛత్రినాక పోలీసులకు అప్పగించారు. ఈ దాడుల్లో కార్మిక శాఖ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కేవీ.నాగేశ్వరరావు, ఎండీ. సైఫుద్దీన్, ఛత్రినాక ఇన్‌స్పెక్టర్ ఆర్.విద్యాసాగర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛత్రినాక ఇన్‌స్పెక్టర్ విద్యాసాగర్ రెడ్డి మాట్లాడుతూ బాల కార్మికులతో పనిచేయించుకోవడం చట్టరీత్యా నేరమని, బాలకార్మికులతో ఎవరైనా పనిచేయించుకున్నా.. అందుకు సహకరించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ విద్యాసాగర్ రెడ్డి తెలిపారు.

*చిత్రం... గాజుల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న బాలకార్మికులతో ఛత్రినాక పోలీసులు