తెలంగాణ

ఎస్సారెస్పీ రెండో దశ కాలువల మరమ్మతులు చేపట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: నల్లగొండ జిల్లాలో వచ్చే ఖరీఫ్ సీజన్‌లో ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు సాగునీటిని అందించడానికి కాలువల మరమ్మతులు చేపట్టాలని సాగునీటి శాఖ అధికారులను విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లో మంత్రి చాంబర్‌లో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాకు చెందిన తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్‌తో కలసి మంత్రి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎప్పుడో తవ్వి వదిలేసిన కాలువలు లోపభూయిష్టంగా ఉన్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం నుంచి గోదావరి జలాలును ఎస్సారెస్పీ కాలువలకు పారించడమే కేసీఆర్ లక్ష్యమన్నారు. కాళేశ్వరం నుంచి సూర్యాపేట జిల్లాలో సాగునీటిని తరలించిన ఘనత కేసీఆర్‌కు దక్కిందన్నారు. కాలువల మరమ్మతులతో పాటు ఇతరత్రా పనుల నిర్మాణాలకు ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. బయ్యన్నవాగును విడుదల చేస్తున్న నీటి సామర్థ్యాన్ని పెంచాలని మంత్రి ఆదేశించారు. నల్లగొండ జిల్లాకు కాళేశ్వరం సాగునీరు రాదంటూ ప్రగల్బాలు పల్కిన ప్రతిపక్షాల నేతలు ఇప్పుటు ఏ మొహం పెట్టుకుని జిల్లాలలో తిరుగుతారని ఆయన ధ్వజమెత్తారు. ప్రతిపక్షాల నేతల గురించి మాట్లాడడంలో అర్థం లేదన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టనె్నల్ పనుల్లో జాప్యం జరిగిందన్నారు.
అయితే, వాటి పనులు సకాలంలో పూర్తి చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రంలో విద్యుత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ అందుబాటులో ఉందన్నారు.
*చిత్రం... అధికారులతో సమీక్షిస్తున్న విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి