తెలంగాణ

సీఏఏపై ఎంఐఎం దుష్ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: సీఏఏపై దేశవ్యాప్తంగా కొన్ని రాజకీయ పార్టీలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయని, దానికి మూలం కూడా హైదరాబాద్‌లోనే ఉందని ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు పేర్కొన్నారు. సోమవారం ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఆనాడు ఐపీఎస్ కృష్ణ ప్రసాద్‌ను హతమార్చిన నిందితులు పాతబస్తీలోనే దొరికారని చెప్పారు. పాతబస్తీలో అనేకమార్లు మత కలహాలు జరగడమే గాక, అనేక సంఘటనలకు కేంద్రంగా ఉందని ఆ కారణంగానే ఆర్‌ఏఎఫ్ (ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు) మార్చ్ చేసి ఉండొచ్చని, అంత మాత్రాన ఎంఐఎం నేత) ఓవైసీ ఇష్టారాజ్యంగా మాట్లాడటం సరికాదని రామచందర్‌రావు అన్నారు. ఆర్‌ఎఎఫ్‌ను హైటెక్ సిటీలో ఉంచాలని అనడం సరికాదని, పోలీసులను కూడా పాతబస్తీకి రానివ్వరా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో అల్లర్లకు ఎవరు బాధ్యులో అందరికీ తెలుసని అన్నారు. ఢిల్లీలో జరిగింది ఊచకోత అంటున్నారని, కానీ ఆ అల్లర్లు ఎంఐఎం, కాంగ్రెస్ సృష్టించినవేనని పేర్కొన్నారు. సీఏఏపై పార్లమెంటులో చేసిన చట్టాన్ని వాస్తవాన్ని చెప్పాల్సింది పోయి అమాయక ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు. నిర్మల్‌లో, బైంసాలో సంఘటనలను ఎవరూ మరిచిపోలేదని, టీఆర్‌ఎస్ ప్రభుత్వ మద్దతుతోనే ఎంఐఎం రెచ్చిపోతోందని, దానిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా పాకిస్థాన్ వారికి పౌరసత్వం ఇస్తామనే రీతిలో సంభాషిస్తున్నారని, ఎంఐఎం ఆలోచనా విధానం టీఆర్‌ఎస్‌కు కూడా పాకిందని పేర్కొన్నారు. హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా గతంలో బోయిగూడలో కొన్ని ఇళ్లు కట్టించి ఆ నమూనాలో తెలంగాణ మొత్తం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తామని నమ్మించి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిచిందని, నేడు జీహెచ్‌ఎంసీ పదవీకాలం కూడా పూర్తికావస్తోందని, ఇంత కాలంలో ఎన్ని ఇళ్లు కట్టారో చెప్పాలని రామచందర్‌రావు డిమాండ్ చేశారు. నగరంలో వర్షం కురిస్తే చాలు పేదల ఇళ్లు కూలిపోతున్నాయని, అలాంటి సంఘటనలు నగరంలో చాలా జరిగాయని ఇటీవలే గోడ కూలి ముగ్గురు చిన్నారులు మరణించారని ఆయన గుర్తుచేశారు. ఆ ఇంటిని కట్టించింది కూడా ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో బీ మోహన్‌రెడ్డి, ఎన్‌వీ సుభాష్, గౌతంరావు, భాస్కర్ పాల్గొన్నారు.
15వ తేదీన హైదరాబాద్‌లో అమిత్‌షా బహిరంగ సభ జరుగుతుందని ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని రామచందర్‌రావు చెప్పారు. ఈ సందర్భంగా సీఏఏపై ఉన్న అనుమానాలను అమిత్ షా నివృత్తి చేస్తారని ఆయన తెలిపారు.
*చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు