తెలంగాణ

నగర పనులపై కేటీఆర్ నజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: మహానగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గి, సిగ్నల్ రహితమైన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్‌ఆర్‌డీపీ పనులను మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సోమవారం ఉదయం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత అధికారులకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆయన క్షేత్రస్థాయిలో పనుల తనిఖీకి వెళ్లారు. ఎస్‌ఆర్‌డీపీ కింద ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న ఎస్‌ఆర్‌డీపీ పనులను ఆయన సుమారు గంటన్నర సేపు తనిఖీ చేశారు. తొలుత రోడ్ నెం. 45కు చేరుకున్న మంత్రి అక్కడ నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించి, ఆ తర్వాత దుర్గంచెరువుపై ఏర్పాటు చేస్తున్న కేబుల్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. రోడ్ నెం. 45 నుంచి ఇనార్బిట్ మాల్ వరకు కాలినడకన వెళ్లిన మంత్రి పనులపై అధికారులకు పలు సూచనలిచ్చారు. క్షేత్ర స్థాయిలో పనులు చేస్తున్న వివిధ ఏజెన్సీలకు చెందిన సిబ్బంది, ఇంజనీర్లతో పనులు జరుగుతున్న తీరుపై ముచ్చటించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు ఏజెన్సీలు కృషి చేయాలని సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖలు సైతం తమ మధ్య సమన్వయాన్ని పెంచుకుని, నిర్ణీత గడువులోపు ఏజెన్సీలు పనులు పూర్తి చేసేందుకు తగిన సహకారాన్ని అందించాలని సూచించారు. రోడ్ నెం. 45 ఫ్లైఓవర్, దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యల గురించి అధికారులతో చర్చించారు. రెండు వారాల్లోగా ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమైన మేరకు విద్యుత్ లైన్లు తొలగిస్తామని అధికారులు మంత్రికి వివరించారు. ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్న ఎల్ అండ్ టీ ఇంజనీర్లతో పనుల ప్రగతి వివరాలను అడిగి తెల్సుకున్నారు. బ్రిడ్జి పనులు దాదాపు పూర్తియినట్లేనని ఇంజనీర్లు తెలిపారు. ఈ బ్రిడ్జి పనులు పూర్తయిన తర్వాత దీనికి అనుసంధానంగా రోడ్ నెం. 45 వరకు చేపట్టిన రోడ్ పనులను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టు ఏజెన్సీని, అధికారులను మంత్రి ఆదేశించారు. ధుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పూర్తయితే పశ్చిమ హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ చాలా వరకు తగ్గుతుందని మంత్రి వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం, డిజైన్లతో నిర్మిస్తున్న ఈ కేబుల్ బ్రిడ్జి హైదరాబాద్ నగరానికి మరింత గుర్తింపును తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. మంత్రి ఆదేశాల మేరకు మేయర్ రామ్మోహన్, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ హైటెక్‌సిటీలో నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జి పనులను పరిశీలించారు.
కూకట్‌పల్లి ప్రాంత ప్రజలకు ఈ బ్రిడ్జితో అనేక ప్రయోజనాలు చేకూరుతాయని, పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని ఏజెన్సీలను వారు ఆదేశించారు. ఆ తర్వాత పనుల పురోగతిపై మంత్రికి వివరాలు సమర్పించారు.
*చిత్రం... నగరంలో సోమవారం ఎస్‌ఆర్‌డీపీ పనుల తనిఖీకి వస్తున్న మంత్రి కేటీఆర్