తెలంగాణ

కరోనాకు రూ.100 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: కరోనా వైరస్ నివారణకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 100 కోట్ల రూపాయలు కేటాయించారని వైద్య ఆరోగ్య మంత్రి ఈట ల రాజేందర్ తెలిపారు. ఈటలతో పాటు మంత్రు లు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావుతో ప్రభుత్వం కరోనా నివారణ కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఇక్కడి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మంగళవారం సమావేశమై ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించింది. సమావేశం తర్వాత వివరాలను మంత్రి ఈటల మీడియా ప్రతినిధులకు వివరించారు. కరోనా వైరస్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారని తెలిపారు. వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండాలని, సమష్టిగా కరోనాను ఎదుర్కొనేందుకే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశార ని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. ఎవరికైనా కరోనా వచ్చినట్టు అనుమానం వస్తే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ సూ చించారు. తెలంగాణలో నివసించే వారిలో ఇప్పటివరకు ఒక్కరికి కూడా కరోనా సోకలేదని స్పష్టం చేశా రు. గాంధీ దవాఖానాతోపాటు ఎర్రగడ్డలోని ఛాతీవ్యాధుల దవాఖానా, మిలటరీ దవాఖానా, వికారాబాద్ అడవుల్లో ఉన్న చెస్ట్ దవాఖానాలను కరోనా వైరస్ చికిత్సల కోసం వాడేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. పైవేట్ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉండే దవాఖానాల్లో మూడు వేల బెడ్స్‌తో ముంద స్తు చర్యలు చేపట్టామని వివరించారు. కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని మం త్రి తెలిపారు. ఇదిలావుండగా, తెలంగాణలో మాస్క్‌లకు కొరత ఉందని, అవసరమైన మేరకు మాస్క్‌లను పంపించాలని కేంద్రాన్ని కోరామన్నారు.
కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం
చేస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రజల అనుమానాల నివృత్తి కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ 104ను కూడా ఏర్పాటు చేశామని, బుధవారం నుండి ఈ హెల్ప్‌లైన్ పనిచేస్తుందని ఆయన ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన దేశాలకు మన దేశం నుండి ఎవరు కూడా అధికారిక కార్యకలాపాలతో పాటు ఇతరత్రా టూర్లకు ఇప్పట్లో వెళ్లవద్దని ఈటల సూచించారు.
హైదరాబాద్‌లో ఒక యువకుడికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో అతనికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని మంత్రి తెలిపారు. అదేవిధంగా ఈ యువకుడితో కలిసిన 88 మందిలో ఇప్పటివరకు 45 మందికి పరీక్షలు నిర్వహించామని మంత్రి తెలిపారు. వీరందరికీ పరీక్షలు నిర్వహించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
కరోనా వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రపంచవ్యాప్తంగా 80 వేల మందికి ఈ వైరస్ సోకితే రెండు వేల మంది మరణించారని మంత్రి వెల్లడించారు. గతంలో వచ్చిన ఎబోలా కంటే కరోనా భయంకరమైంది కాదని ఆయన స్పష్టం చేశారు. గాలి ద్వారా కరోనా వైరస్ సోకే అవకాశం లేదని, కరోనా సోకిన వ్యక్తి మాట్లాడిన సమయంలో తుంపరుల ద్వారా, తుమ్మితే వచ్చే గాలి ద్వారా ఇతరులకు రావచ్చునని ఆయన తెలిపారు. అందువల్ల ప్రతిఒక్కరూ శుభ్రతను పాటించాలని, చేతులను ఎప్పటికప్పుడు బాగా కడుక్కుంటూ ఉండాలన్నారు. కరోనా వైరస్ కారణంగా జలుబు వస్తే 80 శాతం వెంటనే తగ్గిపోతుందన్నారు. మరో 14 శాతం మందికి చికిత్స ద్వారా నయం అవుతుందన్నారు. కరోనా వైరస్ సోకిన వారిలో మూడు శాతం మందిపై మాత్రమే తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆయన అన్నారు. ఈ పరిస్థితిలో ప్రతిఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం తరఫున సూచిస్తున్నామని ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

*చిత్రం... కరోనా వైరస్ నివారణపై మంగళవారం నాడు ఎంహెచ్‌ఆర్‌డీలో జరిగిన మంత్రివర్గ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో మంత్రులు ఈటల, ఎర్రబెల్లి తదితరులు