తెలంగాణ

శాఖల వారీగా నివేదికలు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖలపై శాఖలవారీగా సమగ్ర నివేదికలను రూపొందించాలని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆదేశించారు. పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖల కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన అనితా రాజేంద్ర మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ను ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, తొలుత రాష్ట్ర స్థాయిలో పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమలపై సమావేశాలు నిర్వసించి నివేదికలను రూపొందించి తనకు ఇవ్వాలన్నారు. ఆ తర్వాత జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యలు ఏవైనా ఉంటే నమోదు చేసుకుని తనకు నివేదిక అందించాలని సూచించారు. అధికారులు తనకు నివేదిక అందిస్తే, దానిపై ముఖ్యమంత్రితో మాట్లాడి, పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో పశుసంవర్థక శాఖ అడిషనల్ డైరెక్టర్ రాంచందర్, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ, పాడిపశ్రమ అధికారులు మల్లయ్య, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మంగళవారం కలిసిన పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర