తెలంగాణ

కరోనాపై అధ్యయనానికి కేరళకు బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: కరోనా తొలి పాజిటివ్ కేసును గుర్తించిన కేరళలో వ్యాధి ప్రబలకుండా తీసుకున్న చర్యలను అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడి వైద్య బృందాన్ని పంపించి అక్కడ కరోనా నివారణకు ఏ విధమైన చర్యలు చేపట్టింది అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. కరోనా వ్యాధి లక్షణాలు గుర్తించిన రోగి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో మంత్రివర్గ ఉప సంఘం అత్యవసరంగా సమావేశమై చర్చించింది. ఇదిలావుండగా, కరోనాపై వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంగళవారం రాత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 18,224 మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ నిర్వహించగా అందులో 445 మంది ప్రయాణికులను అనుమానితులు కాగా 100 మంది ప్రయాణికులను 28 రోజులుగా అబ్జర్వేషన్‌లో పెట్టినట్టు పేర్కొన్నారు. వీరిలో 34 మంది అనుమానితులను గాంధీ ఆస్పత్రిలో చేర్పించగా వీరిలో ఒకరికి మాత్రమే పాజిటివ్ నివేదిక వచ్చినట్టు పేర్కొన్నారు. పరీక్షలు నిర్వహించి 155 శాంపిల్స్ పుణెకు పంపించగా అందులో 118 కేసులు నెగేటివ్‌గా తేలిందని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.