తెలంగాణ

సంక్షేమానికి పెద్ద పీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: మరో ఐదు రోజుల్లో రాష్ట్రప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతున్న తరుణంలో సంక్షేమానికి పెద్ద పీట వేసే దిశగా రాష్ట్రప్రభుత్వం అడుగులు వేస్తోంది. పేదలు, బడుగు బలహీనవర్గాలకు గతంలో మాదిరిగా సంక్షేమ ఫలాలు అందిస్తూనే, పన్నుల వసూళ్లు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటాను తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా కదులుతోంది. రాష్ట్రంలో రెవెన్యూ వసూళ్లకు 2019-20 సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించేందుకు పన్నుల శాఖలు కసరత్తును ముమ్మరం చేశాయి. కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్ర వాటా తగ్గడం వల్ల రెవెన్యూ వసూళ్లు తగ్గడానికి ప్రధాన కారణమని అధికారులంటున్నారు. ఆర్థిక మాంద్యం ప్రభావం కూడా పన్నుల వసూళ్లపై పడింది.
2019-20 సంవత్సరంలో రూ.1,13,099 కోట్ల రెవెన్యూను వసూలు చేయాల్సి ఉంది. కాగా ఈ ఏడాది జనవరి వరకు రూ.79,488.24 కోట్లు పన్నుల ద్వారా ఆదాయం వచ్చింది. మొత్తం లక్ష్యంలో 70.28 శాతం వసూలు చేశారు. ప్రతి నెల సగటున రూ.8వేల కోట్ల పన్నును వసూలు చేశారు. పిబ్రవరి, మార్చి కలిపి మరో రూ.16 వేల కోట్లను వసూలు చేయవచ్చని అధికారులంటున్నారు. ఇదే నిజమైతే పన్నుల ద్వారా ఆదాయం రూ.96వేల కోట్లకు చేరుకుంటుంది. అంటే మొత్తం పన్నుల వసూళ్లలో 84 శాతం పన్నుల ఆదాయం వస్తుంది. పనే్నతర ఆదాయం రూ.15,875 కోట్లు వసూలు చేయాలని 2019-20లో ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాగా ఈ ఏడాది జనవరి వరకు రూ.3456 కోట్లు వసూలైంది. దీని ప్రభావం రాష్ట్ర సంక్షేమ పథకాలపై పడే అవకాశం కనపడుతోంది. కాగ్ అంచనా ప్రకారం రాష్ట్రం సొంత పన్నుల ఆదాయం రూ.89,047.14 కోట్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, జనవరి వరకు రూ.67,574.73 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం 75.89 శాతం ఆదాయాన్ని రాష్ట్రప్రభుత్వం వసూలు చేసింది. ఆర్థిక మాంద్యం ప్రభావం వల్ల అంచనాలు తప్పి రుణభారం పెరిగింది. రూ. 24,081.75 కోట్ల రుణాలు తెచ్చుకోవాలని ప్రతిపాదించగా, రూ.26,383.82 కోట్ల రుణాలు తెచ్చారు. బడ్జెట్ రోజు రాష్ట్రప్రభుత్వం 2020-21 బడ్జెట్‌తో పాటు 2019-20 సవరించిన బడ్జెట్ వివరాలనుకూడా అసెంబ్లీకి సమర్పిస్తారు. రెవెన్యూరాబడి, ఆర్థిక మాంద్యం ప్రభావం తదితర కారణాలు ఉన్నా, ఆర్థిక ప్రగతిపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చని ప్రభుత్వవర్గాలు అంటున్నాయి. 2015-20 మధ్య రెవెన్యూ వసూళ్లు పనే్నతర వనరుల నుంచి 8 శాతం వరకు నమోదైంది. రాయల్టీ, వడ్డీ, పబ్లిక్ సెక్టార్ నుంచి వచ్చే డివిడెండ్లు, ఇతర ఫీజులు, జరిమానాల వల్ల పనే్నతర వనరుల ఆదాయం వస్తుంది. సాలీనా ఈ విభాగంలో రెవెన్యూవృద్ధిరేటు 12 శాతం వరకు ఉంది. 2015-20 మధ్య రాష్ట్రప్రభుత్వం వేతనాలు, పెన్షన్లు, వడ్డీచెల్లింపులకు 50శాతం రెవెన్యూను ఖర్చుపెట్టింది. 2018-19 మధ్య తలసరి జీఎస్‌డీపీ తెలంగాణలో 14 శాతం నమోదైంది. 2017-18లో రూ.1,98,993 కోట్లు ఉంటే, 2018-19లో రూ.2,26,575 కోట్లకు చేరుంది. రాష్ట్రం సొంత పన్నుల ఆదాయం 2017-18లో రూ.56,520 కోట్లు, 2018-19లో రూ.66,750కోట్లు, 2019-20లో 69,329 కోట్లు, రాష్ట్ర సొంత పనే్నతర ఆదాయం 2017-18లో రూ.2825 కోట్లు, 2018-19లో 6,347 కోట్లు, 2019-20లో 15,875 కోట్ల ఆదాయం ఉంది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో 2017-18లో రూ.8,059 కోట్లు, 2019-19లో రూ.28,042 కోట్లు, 2019-20లో 8,178కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటాలో 2017-18లో 16,420 కోట్లు, 2018-19లో 19,960 కోట్లు, 2019-20లో 19,719 కోట్లు వచ్చింది.