తెలంగాణ

గీత కార్మికుల ఎక్స్‌గ్రేషియా పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: గీత వృత్తిదారులు ఆత్మగౌరవంతో జీవించాలని సీఎం కేసీఆర్ నీరా పాలసీని ప్రవేశపెట్టారని, ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికులకు చెల్లించే ఎక్స్‌గ్రేషియాను రూ. రెండు లక్షల నుండి రూ. ఐదు లక్షల వరకు పెంచి చేయూతనిచ్చారని క్రీడలు, ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
తెలంగాణ గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకుదెబ్బ)కి నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షుడు అమరవేని నర్సాగౌడ్ మంగళవారం మంత్రి నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను మంత్రి అభినందించారు.
మంత్రి మాట్లాడుతూ గీత వృత్తిదారుల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం సీఎం కృషి చేస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని కుల వృత్తుల పునరుద్ధరణకు కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. మోకుదెబ్బ కార్యవర్గ సభ్యులు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్న డిమాండ్లను పరిశీలించి సీఎం దృష్టికి తీసుకు వెళ్తానని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ కార్యదర్శి సద్దిరాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.