తెలంగాణ

ఎయిడెడ్ కాలేజీలను ప్రభుత్వపరం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: ఎయిడెడ్ కాలేజీలను ప్రభుత్వ పరం చేయాలని ఎబీవీపీ మంగళవారం నాడు డిమాండ్ చేసింది. ప్రైవేటు వ్యక్తుల నుండి వాటిని ప్రభుత్వం పరం చేయాలని జీవో 35ను రద్దుచేయాలని, ఎయిడెడ్ కాలేజీల భూములను కబ్జాదారుల నుండి కాపాడాలని కాలేజీయేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. దాంతో పోలీసులు ముందు జాగ్రత్తగా వారిని అడ్డుకుని, ఏబీవీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ కార్యదర్శి పగిడిపల్లి శ్రీహరి మాట్లాడుతూ పేద , మధ్య తరగతి విద్యార్ధులు చదువుకునే ఎయిడెడ్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే కుట్ర జరుగుతోందని తెలంగాణలో ఉన్న 68కి పైగా కాలేజీలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు. ప్రైవేటు యాజమాన్యాలతో కుమ్మక్కై కోట్ల విలువ చేసే ఎయిడెడ్ కాలేజీలను కొట్టేయాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. ఎయిడెడ్ కాలేజీల్లో ఖాళీలున్నా ఫ్యాకల్టీని నియమించకుండా పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారని అన్నారు. జీవో 35 రద్దు చేసి దోస్త్ డిగ్రీ అడ్మిషన్లలో ప్రైవేటు ఎయిడెడ్‌ను తొలగించి , ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీలను చేర్చాలని అన్నారు. ఆ కాలేజీల్లో ఉన్న అన్ని ఖాళీలనూ భర్తీచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నేతలు ప్రవీణ్, సుమన్, మహేష్, అనిత, నిహారిక, శ్రీకాంత్ పాల్గొన్నారు. కాగా, మరో పక్క విద్యార్థులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మొండివైఖరిని నిరసిస్తూ పలు డిమాండ్ల సాధనకు ఏబీవీపీ ప్రారంభించిన నిరసన కార్యక్రమంలో భాగంగా రాజధానిలోని పలు డిగ్రీ కాలేజీలకు వెళ్లి సహకారం అందించాలని కోరారు. విద్యార్ధులు అంతా ముందుకువచ్చి సహకరిస్తే ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదలకు ఐక్య ఉద్యమం చేయాలని నిర్ణయించినట్టు ఏబీవీపీ నేతలు ఫుల్‌సింగ్, అరుణ్, వినీత్ పేర్కొన్నారు.
టీచర్లకు ట్రైనింగ్
ఆంగ్లభాషా ప్రావీణ్యతకు, బోధనకు ప్రభుత్వ టీచర్లకు తొమ్మిది వారాల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలంగాణ ఎస్సీఈఆర్‌టీ పేర్కొంది. ఆసక్తి ఉన్న వారు తమ దరఖాస్తులను ఎస్సీఈఆర్టీ డాట్ తెలంగాణ డాట్ జీవోవీ డాట్ ఇన్ అనే వెబ్ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో సమర్పించాలని వారు సూచించారు.