తెలంగాణ

గవర్నర్‌తో సీఎం భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 4: శాసనసభ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజ్‌భవన్‌లో బుధవారం సాయంత్రం గవర్నర్ తమిళిసైతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. మంత్రిమండలి ఆమోదించిన గవర్నర్ ప్రసంగ పాఠాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అందజేశారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందురోజు శాసనసభ, శాసనమండలి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శాసనసభ బడ్జెట్ సమావేశాలు, రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు సీఎం కేసీఆర్ వివరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గవర్నర్‌కు సీఎం శుభాకాంక్షలు తెలియజేశారు.

*చిత్రం...రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిన గవర్నర్ ప్రసంగ పాఠాన్ని తమిళిసైకి బుధవారం అందజేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్