తెలంగాణ

గవర్నర్ ప్రసంగంలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీ వ్యతిరేక అంశాలను ప్రస్తావించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 4: కేసీఆర్ సర్కార్‌కు పౌరసత్వసవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక పట్ల నిజంగా వ్యతిరేకత ఉంటే, ఈ నెల 6వ తేదీన గవర్నర్ ప్రసంగ పాఠంలో ఆ అంశాలను ప్రస్తావించాలని టీపీసీసీ డిమాండ్ చేసింది. టీపీసీసీ కోశాధికారి గూడూరి నారాయణ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రప్రభుత్వం ఈ రెండు అంశాలపై స్పష్టత ఇవ్వాలన్నారు. తన వైఖరిని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పాలన్నారు. ప్రధానమైన ఈ అంశాలపై రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అభిప్రాయాలను మార్చుకోరాదని ఆయన సీఎం కేసీఆర్‌ను కోరారు. రాష్ట్రప్రభుత్వం సీఏఏ, ఎన్‌ఆర్‌సీని అమలు చేసే ప్రసక్తిలేదని ఇంతవరకు కరాఖండిగా చెప్పలేదన్నారు. సీఏఏను ఉపసంహరించుకోవాలని రాష్టమ్రంత్రివర్గం తీర్మానాన్ని ఆమోదించిందన్నారు. తెలంగాణలో వివాదస్పద సీఏఏను అమలు చేయబోమని చెప్పలేదన్నారు. దీనిపై రాష్ట్ర మంత్రివర్గం కూడా చర్చించలేదన్నారు. గత నెల 25వ తేదీన బిహార్ అసెంబ్లీ కూడా ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌పై తీర్మానాన్ని ఆమోదించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జేడీయూ ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామ్య పక్షం అని ఆయన గుర్తు చేశారు. ఎన్‌పీఆర్, ఎన్‌సీఆర్‌పై తీర్మానం ప్రవేశపెడితే కాంగ్రెస్ పార్టీ కూడా అసెంబ్లీలో మద్దతు ఇస్తుందన్నారు. ప్రస్తుత ఎన్‌పీఆర్ ఫార్మెట్‌లో తల్లితండ్రులు ఎక్కడ జన్మించారన్న అంశం ఉందన్నారు. 2010 యూపీఏ సర్కార్ ప్రవేశపెట్టిన ఫార్మెట్‌లోనే ఎన్‌పీఆర్ ( జాతీయ జనాభా పట్టిక)ను అమలు చేస్తామని కేసీఆర్ సర్కార్ అసెంబ్లీ వేదికగా ప్రకటించాలన్నారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీపై కూడా ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారన్నారు. దీని వల్ల అల్లర్లు చెలరేగుతున్నాయన్నారు.
అసెంబ్లీలో కూడా కరోనా వైరస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: జగ్గారెడ్డి
కరోనా వైరస్‌ను నిరోధించేందుకు రాష్ట్రప్రభుత్వం, హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసిందని, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో అసెంబ్లీలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం విదేశీ పర్యటనలకు సహజంగా వెళ్లి వస్తుంటారన్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సీఎంను కోరారు.