తెలంగాణ

రేవంత్‌పై నోరు పారేసుకోకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 4: బూటకపు వాగ్దానాలతో ప్రజలను కేసీఆర్ మోసం చేసి అధికారంలోకి వచ్చారని, కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డిపై టీఆర్‌ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం అని టీపీసీసీ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ అన్నారు. బుధవారం ఇక్కడ ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేనందుకు నిరసనగా రేవంత్ రెడ్డి పట్నం గోస కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. దీనిపై ప్రజల నుంచి మంచి సానుకూల స్పందన రావడంతో, ప్రభుత్వం ఓర్వలేక ఇష్టం వచ్చినట్లు కేసులు బనాయిస్తోందన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల సంగతి అడిగితే, ప్రభుత్వం కాంగ్రెస్ నేతలను వేధిస్తోందన్నారు. కేటీఆర్ కట్టుకున్న 111 జీవోని ఫామ్ హౌస్ విషయంలో ఎందుకు విచారణ జరపరన్నారు. దళిత నేతలు బాల్క సుమన్, గువ్వల బాలరాజుకు రేవంత్ రెడ్డిపై మాట్లాడినందుకు పదవులు ఇచ్చారన్నారు. కాగా. సోషల్ మీడియా నుంచి వైదొలగాలని ప్రధాని మోదీజీ చేసిన ప్రకటనను పూర్తిగా స్వాగతిస్తున్నట్లు టీపీసీసీ కార్యదర్శి సలీం అన్నారు. తప్పుడు ప్రచారం చేయడానికి మోడీజీ సోషల్ మీడియా, బహిరంగ సమావేశాలను వాడుకున్నారన్నారు. ప్రెస్‌మీట్స్‌లను నిర్వహించడం ద్వారా మీడియాను ఎదుర్కొనడానికి మోదీ ఎప్పుడూ సాహసించలేదన్నారు. ఇది భారత చరిత్రలో అత్యంత బలహీనమైన ప్రధానమంత్రి అని చూపిస్తుందన్నారు. భారత్, హిందూమతం, మానవత్వం సూత్రాలకు వ్యతిరేకంగా మోదీ, అమిత్‌షా పనిచేస్తున్నారన్నారు. పేదలు, పేదలుగా మారారని, ధనికులు, ధనవంతులు అయ్యారని, దేశంలో కొద్ది మంది పెట్టుబడిదారుల అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం పగలు, రాత్రి కృషి చేస్తున్నట్లు చెప్పారు.పేదలు, రైతులు, జవాన్లు, మహిళలు, నిరుద్యోగులు, వ్యాపారులు, దళితులు, మైనారిటీలు నిర్లక్ష్యానికి గురయ్యారన్నారు.