తెలంగాణ

సెట్విన్ నేతృత్వంలో కొత్త కోర్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 4: ‘సెట్విన్’ నేతృత్వంలో యువతీ, యువకులకు ఉపాధి కల్పించేందుకు కొత్తగా కొన్ని కోర్సులను ప్రారంభిస్తున్నారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ బుధవారం ఇక్కడ విడుదల చేశారు. బయోమెడికల్ ఇంజనీరింగ్ ఎక్విప్‌మెంట్ సర్వీస్, ఆఫ్తాల్మాలజీ ఎక్విప్‌మెంట్ సర్వీసింగ్, పీసీబీ రిపేర్ టెక్నీషియన్, ఫైర్ అలారం ఇన్స్టలేషన్ అండ్ మెయింటెనెన్స్ కోర్సులను విద్యానగర్‌లోని సెట్విన్ కేంద్రంలో ప్రారంభిస్తున్నారు. కోర్సుల డిమాండ్‌ను బట్టి ఇతరకేంద్రాల్లో కూడా ఈ తరహా కోర్సులను ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. సెట్విన్ నేతృత్వంలో వివిధ కోర్సుల్లో ఇప్పటికే నాలుగులక్షల మంది యువతీ, యువకులకు శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించామని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్, ట్రైనింగ్ మేనేజర్ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.