తెలంగాణ

ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర మహత్తరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 4: తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర కీలకమైనదని, వారి సేవలను కేసీఆర్ సర్కార్ ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. రాష్ట్రప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ఉద్యోగులు సామాన్యప్రజలకు అందిస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని ఆయన అన్నారు. బుధవారం ఇక్కడ తెలంగాణ ఉద్యోగుల సంఘం రూపొందించిన నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఉద్యోగులతో ముచ్చటించారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత గత ఆరేళ్లలో పర్యాటక, క్రీడా, సాంస్కృతిక రంగంలో గణనీయమైన అభివృద్ధిని సాధించిందన్నారు. ఇందులో ఉద్యోగుల పాత్ర విశిష్టమైనదన్నారు. ఉద్యోగుల డిమాండ్ల పట్ల రాష్ట్ర సర్కార్ సానుకూల వైఖరితో ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు అద్వితీయమైన పాత్రను పోషించారని ఆయన ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. తమ ఉద్యోగాలను పణంగా పెట్టి రాష్ట్ర సాథనకు ఉద్యోగులు తెగువతో ఉద్యమంలో ముందుండి నడిచారన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మాచారి, కార్యదర్శి పవన్ కుమార్ గౌడ్, అసోసియేట్ అధ్యక్షుడు ఎం రవీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.