తెలంగాణ

ఐటీ పరిశ్రమ విలవిల: కోవిడ్-19 ఎఫెక్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 4: ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులను తెలంగాణలోనూ గుర్తించడంతో ఐటీ పరిశ్రమ ఉలిక్కిపడింది. తెలంగాణలో నమోదైన కరోనా అనుమానితుల జాబితాలోని 81 మందిలో సగానికి పైగా ఐటీ ఉద్యోగులు కావడం గమనార్హం. దీంతో ఐటీ కంపెనీలు ఉద్యోగుల్లో భయాందోళన తొలగించడానికి వర్కు ఎట్ హోంను ఆదేశించాయి. ఇప్పటికే ఐటీ రంగంలో 62 శాతం మంది వర్కు ఎట్ హోంలోనే ఉన్నారు. తెలంగాణ నుండి ఐటీ ఎగుమతుల్లో గత కొద్ది సంవత్సరాలుగా 17 శాతం వృద్ధి రేటు నమోదు చేయడంతో పాటు లక్షకోట్లను దాటింది. మరో పక్క ఐటీ రంగంలో 2017-18 సంవత్సరంలో 4.85 లక్షల మంది ఉద్యోగులుండగా, ఆ సంఖ్య 2018-19 నాటికి 5.5 లక్షలకు చేరుకుంది. బుధవారం నాడు కరోనా వైరస్ తీవ్రత ప్రస్ఫుటం కావడంతో ఉద్యోగులకు పలు ఐటీ కంపెనీలు వర్కు ఎట్ హోం ఆప్షన్‌ను ఇచ్చాయి. ఉద్యోగులు కంపెనీకి రాకుండానే తమ ఇళ్ల నుండే కార్యకలాపాలు కొనసాగించవచ్చని సూచించాయి. కరోనా తీవ్రత తొలగేంత వరకూ లేదా తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ ఈ సర్దుబాటు కొనసాగుతుందని పేర్కొన్నాయి. అయితే ఐటీ కంపెనీలు ఏవీ మూతపడలేదని అన్ని కంపెనీలు యథాతథంగా పనిచేస్తున్నాయని ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌రంజన్ పేర్కొన్నారు. బుధవారం ఉదయమే యథాతథంగా ఐటీ కంపెనీలు పనిచేస్తాయని ఆయన చెప్పారు. డీఎస్‌ఎంలో పనిచేసే ఉద్యోగికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో ఐటీ కంపెనీలు అప్రమత్తం అయ్యాయి. ఆయన కొద్ది వారాలుగా ఎక్కడికి వెళ్లాడో, ఎవరితో కలిసి తిరిగాడో, వారి ఆరోగ్య పరిస్థితి ఏమిటో కూడా ఆరా తీస్తున్నారు. ఇటీవలె ఆయన ఇటలీ వెళ్లాడని కొంత మంది చెబుతుండగా, మరికొంత మంది జర్మనీ వెళ్లినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు కరోనా సోకిందని చెబుతున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని ఐటీ కంపెనీలు ఉద్యోగులకు సూచిస్తున్నాయి. హ్యాండ్ శానిటైజర్లను ఉపయోగించాలని, జన సమ్మర్ధం ఉన్న ప్రాంతాల్లో వస్తువులను తాకవద్దని, కరచాలనాలను తగ్గించుకోవాలని ఉద్యోగులకు సూచించాయి. ఆఫీసు నుండి ఇంటికి వెళ్లేటపుడు మెట్ల మార్గాన్ని ఉపయోగించాలని, వైరస్‌ల వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగత శుభ్రత పాటించాలని కంపెనీలు ఉద్యోగులకు సూచించాయి. మరో వైపు ఐటీ పరిశ్రమ కుదేలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలను చేపట్టింది. చికెన్, మటన్, గుడ్లు తినడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందదని ఒక వైపు విస్తృత ప్రచారం చేస్తూనే మరోవైపు ఐటీ ఉద్యోగులకు ఎలాంటి భయాందోళన అక్కర్లేదని చెబుతోంది.