తెలంగాణ

ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 5: ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. సెకండియర్ పరీక్షలకు 4,18,944 మంది రిజిస్టర్ చేసుకోగా, 4,03,459 మంది హాజరయ్యారని, 15,483 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారని అన్నారు. 22 మంది విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. నిజామాబాద్‌లో ఇద్దరు, యాదాద్రి జిల్లాలో ఐదుగురు, రంగారెడ్డిలో 12 మంది, మహబూబ్‌నగర్ లో ఒకరు, మెదక్‌లో ఒకరు, నారాయణపేటలో 01 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేశామని తెలిపారు. మహబూబ్‌నగర్‌లో ఒక విద్యార్థి జవాబుపత్రంతో పారిపోవాలని చూస్తే ఆయనను పట్టుకుని పోలీసులకు అప్పగించారని, ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైందని చెప్పారు.
ఇఫ్లూలో ఫినిషింగ్ స్కూల్ కార్యక్రమం
ఇఫ్లూలో విద్యార్థులు అందరికీ సాఫ్ట్ స్కిల్స్‌పై శిక్షణ అందజేస్తున్నట్టు వీసీ ప్రొఫెసర్ ఈ సురేష్‌కుమార్ తెలిపారు. గురువారం నాడు ఫినిషింగ్ స్కూల్ ఆధ్వర్యంలో ‘విషయ రచన - అవకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థీ పరిపూర్ణంగా తయారుకావాలనే లక్ష్యంతోనే ఫినిషింగ్ స్కూల్‌లో వారికి అనేక రంగాల్లో తర్ఫీదు, శిక్షణ, వికాసాన్ని అందిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో అనూష శంకరనారాయణ, పాయల్ దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు.
విద్యా రంగానికి నిధులు పెంచాలి
తెలంగాణలో విద్యారంగానికీ, వ్యవసాయ - సంక్షేమ రంగాలకు నిధులు పెంచాలని తెంలగాణ ప్రొగ్రెసివ్ టీచర్సు ఫెడరేషన్, తెలంగాణ విద్యావంతుల వేదిక, రైతు స్వరాజ్య వేదికలు కోరాయి. ఢిల్లీ రాష్ట్రం విద్యారంగానికి 26 శాతం నిధులను కేటాయించిందని, తెలంగాణలో కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని కోరారు. వౌలికవసతుల పెంపు, టీచర్ల నియామకం, యూనివర్శిటీ టీచర్ల నియామకం చేపట్టాలని, వర్శిటీల్లో అదనపు కోర్సులు ప్రారంభించాలని, ప్రీ ప్రైమరీ విద్యను ప్రాధమిక విద్యలో భాగం చేయాలని, కామన్ స్కూల్ విధానం అమలుచేయాలని, స్కూళ్లలో వౌలిక వసతులు కల్పించాలని, విద్యావ్యాపారాన్ని అరికట్టాలని, ప్రతి జిల్లాలో ఒక యూనివర్శిటీ, ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు రైతు స్వరాజ్య వేదిక తరఫున కనె్నగంటి రవి, విస్సా కిరణ్‌కుమార్, ఆశాలత, బీ కొండల్‌రెడ్డి, టీపీటీఎఫ్ తరఫున కే రమణ, వై అశోక్ కుమార్, ఎం శ్రీనివాసులు, ఈ రఘునందన్, విద్యావంతుల వేదిక తరఫున అంబటి నాగయ్య, పీ సైదులు కోరారు.