తెలంగాణ

పాత్రికేయ దిగ్గజం పొత్తూరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 5: పత్రికా సంపాదకుడిగా ఆ స్థాయికి వనె్న తెచ్చిన పొత్తూరి వెంకటేశ్వరరావు మరణించడం ఎంతో బాధాకరమని, పాత్రికేయ రంగానికి దిగ్గజంగా నిలిచారని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. పొత్తూరి మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పత్రికా, సామాజిక సేవా రంగాల్లో ఆయన చేసిన కృషిని అందించిన సేవలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పొత్తూరి వెంకటేశ్వరరావు అందించిన నైతిక మద్దతును కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. పొత్తూరి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బీజేపీ నేతలు డాక్టర్ కే లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఎన్ రామచందర్ రావు, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వేర్వేరు ప్రకటనల్లో సంతాపాలు తెలిపారు. ఐదు దశాబ్దాలకు పైగా తెలుగు పత్రికా రంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రజాస్వామ్య మానవ హక్కుల పరిరక్షణ కోసం అహర్నిశలు కృషి చేసిన మానవతావాది పొత్తూరి మృతి పత్రికారంగానికి, ప్రజాస్వామ్యవాదులకు, తెలుగు ప్రజలకు తీరని లోటని టీపీసీసీ అధికార ప్రతినిధి జీ నిరంజన్ అన్నారు. రాజీవ్ గాందీ సద్భావనా యాత్ర స్మారక సమితి సంవత్సరంలో వారికి సద్భావనా అవార్డును ప్రదానం చేసి ఘనంగా సత్కరించినట్లు ఆయన పేర్కొన్నారు. వారి కుటంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతూ ఆత్మకు శాంతి కలగాలని భవంతుడుని ప్రార్థిస్తున్నట్లు ఆయన చెప్పారు. మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ప్రజాగాయకుడు గద్దర్, ప్రొఫెసర్ కోదండరామ్, తెలంగాణ రాష్ట్ర సలహాదారు కేవీ రమణాచారి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
*పొత్తూరి వెంకటేశ్వరరావు (ఫైల్‌ఫొటో)