తెలంగాణ

మరో 10 భరోసా కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 5: మహిళాలు పిల్లలపై జరిగే లైంగిక దాడులు, అత్యాచారాలు, హింస, కేసులను ప్రధానంగా పోస్కో కేసులను పరిష్కరించేందుకు భరోసా హైదరాబాద్‌లో కేంద్రం ఇప్పటికే ఏర్పాటైంది. నగరంలోని భరోసా కేంద్రం సత్ఫాలితాలు ఇస్తున్నందున మరో పది జిల్లాలో ఈ భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ప్రకటించారు. మహిళలు, పిల్లల సంక్షేమం తదితరంగాల్లో విశేషంగా కృషి చేస్తున్న తరుణీ స్వచ్ఛంద సంస్థ 20వ వార్షికోత్సవ కార్యక్రమానికి డీజీపీ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఇంట్లోనూ, పని ప్రదేశంలో, శారీరక, లైంగిక, మానసిక, ఆర్థిక హింసను ఎదుర్కొనే మహిళలు, పిల్లలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే అవసరం లేకుండా ఒకేచోట లభించేలా చూడలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలు సత్ఫాలితాలనిచ్చాయన్నారు. ఈ భరోసా కేంద్రాలను మరో పది జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు. సమాజంలో ఉన్న అవ్యవస్థ నిర్మూలనకు పోరాడేక్రమంలో బలమైన ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వడం సహజమని, ఇలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని లక్ష్య సిద్దిని సాధించడమే గొప్ప విషయమని పేర్కొన్నారు. సమాజ మార్పు క్రమంలో ఎన్నో శక్తులు ఆపడానికి, నియంత్రించేందుకు ప్రయత్నిస్తాయని అన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ దాదాపు 17 వేల మంది మహిళలు, పిల్లలను రక్షించిన ఘనత తరుణి సంస్థదని ప్రశంసించారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రతకై పోలీస్ శాఖ చేపట్టిన ప్రతి పనిలో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఉందని, ముఖ్యంగా 2016 నుండి తరుణీ తమకు పూర్తిస్థాయిలో సహాయ, సహకారాలు అందిస్తోందని డీజీపీ గుర్తు చేశారు. మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతీలక్రా మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో భరోసా, షీ టీమ్, ఎన్‌ఆర్‌ఐ సెల్ ఏర్పాటు తదితర మహిళా భద్రతా విభాగం కార్యక్రమాల నిర్వహణలో తరుణీ లాంటి స్వచ్చంద సంస్థలు చురుకుగా పాల్గొంటున్నాయని ప్రశంసించారు. ఈ సంర్భంగా మహిళా, శిశు సంక్షేమ రంగంలో విశేష సేవలందించిన పలువురు ప్రముఖులకు పురస్కారాలు, పాఠశాల విద్యార్థినులకు సైకిళ్లను అందజేశారు.
*చిత్రం...తరుణి సంస్థ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో గురువారం నిర్వహించిన
కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ మహేందర్‌రెడ్డి, ఐజీ స్వాతిలక్రా