ఆంధ్రప్రదేశ్‌

రాజకీయ పార్టీలకు ప్రభుత్వ భూములెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: రాజకీయ పార్టీలకు ప్రభుత్వ భూములను రాజధాని అమరావతితో పాటు జిల్లా కేంద్రాల్లో ఇవ్వాలన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వైకాపా తీవ్రంగా వ్యతిరేకించింది. వెంటనే ఈ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. అసెంబ్లీలోరాజకీయ పార్టీలకు సీట్లను బట్టి భూములు, స్ధలాన్ని కేటాయించాలన్న ప్రభుత్వం నిర్ణయం దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ప్రజలు రాజకీయ పార్టీలను ఎన్నుకునేది అభివృద్ధి, సంక్షేమం కోసమని ఆయన అన్నారు. శుక్రవారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ కాని టిడిపి ప్రభుత్వం ఈ వాస్తవాన్ని మర్చిపోయి అసెంబ్లీ సీట్లను బట్టి స్ధలాలను కేటాయిస్తామని చట్టానికి సవరణలు చేయాలనుకుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. ఏపిఐఐసి వద్ద 3 లక్షల భూమి ఉందని పరిశ్రమలు వచ్చేస్తున్నాయని ప్రభుత్వం ప్రకటిస్తోందన్నారు. మరో 7 లక్షల భూములను సేకరిస్తున్నట్లు కూడా చంద్రబాబు అంటున్నారని ఆయన చెప్పారు. ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యం పార్టీలకు, తనకు కావాల్సిన పరిశ్రమలకు కేటాయించేందుకు ప్రజలు అధికారం ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చౌకగా భూములను కొట్టేయాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను సాగనివ్వమని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు మచిలీపట్నం పోర్టుకు ఐదు వేల ఎకరాలు చాలని చెప్పారన్నారు. ఇప్పుడు లక్ష ఎకరాలు ఎందుకని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో బడుగు, మధ్యతరగతి వర్గాలు, పేదలకు గృహాలు నిర్మించేందుకు వినూత్న పథకాలు అమలు చేయకుండా రాజకీయ పార్టీలకు భూముల పందేరం చేసే పిచ్చి ఆలోచనలు మానుకోవాలని ఆయన కోరారు.