తెలంగాణ

రైతు సమస్యలు పట్టని కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 5: రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యం చెందారని టీఎస్ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ధ్వజమెత్తారు. గురువారం హైదరాబాద్ ధర్నాచౌక్ వద్ద ఏర్పాటుచేసిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఆయన గుర్తు చేశారు. హామీలతో మభ్యపెట్టి ఓట్లు దండుకున్న కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు పరిమితం అయ్యారని ఆయన ఘాటుగా విమర్శించారు. కేసీఆర్ హామీలను అమలు చేయడానికి క్షేత్రస్థాయిలో టీడీపీ ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పార్టీ కేడర్‌కు పిలుపు ఇచ్చారు. రైతులకు రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వ ప్రకటనలు తప్పా ఆచరణలో అమలు కావడంలేదని ఆయన కనె్నర్ర చేశారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్‌లు అందని ద్రాక్షగా మారాయని ఆయన ఎద్దేవ చేశారు. నిరుద్యోగుల భృతి కాగితాలకు పరిమితం అయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నాలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి, నర్సిరెడ్డి, మీడియా అధికార ప్రతినిధి ప్రకాశ్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు ధర్నాలో మాట్లాడారు.

*చిత్రం...ధర్నా చౌక్‌లో పార్టీ నేతల నుద్దేశించి మాట్లాడుతున్న టీఎస్ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ