తెలంగాణ

బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: 2020-21 సంవత్సరానికి సంబంధించి తయారు చేసిన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు నేతృత్వంలో ప్రగతిభవన్‌లో శనివారం రాత్రి మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆదివారం ఉదయం 11.30 గంటలకు వార్షిక బడ్జెట్‌ను శాసనసభకు ఆర్థిక మంత్రి టీ హరీష్‌రావు సమర్పిస్తారు. శాసనసభకు బడ్జెట్‌ను సమర్పించే ముందే దీనికి మంత్రివర్గం ఆమోదం అవసరం ఉంటుంది. బడ్జెట్ పూర్వాపరాలను ఈ సందర్భంగా హరీష్‌రావు మంత్రివర్గ సమావేశంలో
వివరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, కేంద్రం నుండి వచ్చే గ్రాంట్-ఇన్-ఎయిడ్, ఇతర పథకాల ద్వారా లభించే ఆర్థిక సాయం, ప్రభుత్వానికి ఇతర మార్గాల్లో లభించే ఆదాయం తదితర వివరాలను మంత్రివర్గ సమావేశంలో హరీష్‌రావు వివరించారు. మంత్రులు తమ తమ శాఖల అవసరాలను వివరిస్తూ, ఆర్థిక మంత్రికి పంపించిన నివేదికలను దృష్టిలో ఉంచుకుని వివిధ శాఖలకు కేటాయింపులు, ఏ విధంగా చేశారో హరీష్‌రావు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు, ఆర్థిక మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌పై ఈ సమావేశంలో మంత్రుల అనుమానాలను నివృత్తి చేశారు. ఆ తర్వాత బడ్జెట్‌కు ఆమోదం లభించింది.