తెలంగాణ

కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు శనివారం నాడు వాడివేడిగా కొనసాగాయి. శాసనసభ నుండి కాంగ్రెస్ సభ్యులను ఒకరోజుపాటు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సస్పెండ్ చేశారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మాట్లాడటానికి ప్రయత్నించినపుడు ముందుగా తమకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. సీఎం కేసీఆర్ ప్రసంగానికి అడ్డుతగిలిన ఆరుగురు కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో సభ నుండి కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, డీ శ్రీ్ధర్‌బాబు, సీతక్క, పొదెం వీరయ్య, జగ్గారెడ్డిలను ఒకరోజుపాటు సస్పెండ్ చేస్తున్నట్టు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వాస్తవానికి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని సభాకార్యక్రమాల నుండి ఒకరోజు సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టినా, కాంగ్రెస్ సభ్యుల పేర్లన్నీ స్పీకర్ పేర్కొన్నారు. దానికి కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు దూసుకువెళ్లడంతో స్పీకర్ మార్షల్స్‌ను పిలిపించారు. వెంటనే కాంగ్రెస్ సభ్యులు సభ విడిచి వెళ్లాలని స్పీకర్ పదే పదే కోరినా వారు నిరసన వ్యక్తం చేయడంతో మార్షల్స్ సహాయంతో వారిని బయటకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మంత్రులను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేయగా, మంత్రులు సైతం తమదైన శైలిలో సమాధానం చెప్పారు. తొలుత సభలో ముఖ్యమంత్రి లేచి సమాధానం చెప్పాలని చూడగానే కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క లేచి తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. అప్పటికే చాలాసేపు కాంగ్రెస్ సభ్యులు మాట్లాడారని, తన ప్రసంగం అనంతరం ఏమైనా ఉంటే చెప్పాలని సీఎం సూచించారు. అంతలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి లేచి డీసీసీబీ బ్యాంకుల ఎన్నికలకు సంబంధించి కొంత మంది డైరెక్టర్లను టీఆర్‌ఎస్ నేతలు కిడ్నాప్ చేశారంటూ సభలో ప్రస్తావించడానికి ప్రయత్నించారు. దానికి స్పీకర్ అనుమతించలేదు. సభ్యులు సభలో అరవడం కాదని, సభా గౌరవానికి భంగం వాటిల్లితే కఠిన చర్యలు తప్పవని సీఎం చెప్పారు. సభలో అరుపులు, పెడబొబ్బలు పనికిరావని, ఈ పద్ధతిలో సభ జరగదని అన్నారు. సభ్యులకు వినే ఓపిక ఉండాలని సీఎం అన్నారు.