తెలంగాణ

సీఏఏపై తీర్మానం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లపై శాసనసభ సమావేశాల్లో భాగంగా ఒకరోజు ప్రత్యేక చర్చ జరగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పేర్కొన్నారు. జాతీయ పౌర చట్టం (సీఏఏ) గురించి ఇంత గందరగోళం సృష్టించే కంటే జాతీయ గుర్తింపు కార్డును పెట్టవచ్చని కేసీఆర్ సూచించారు. కేంద్రం ప్రతిపాదించిన పౌరసత్వ సవరణ చట్టం ప్రాథక హక్కులనే అగౌరవపరుస్తోందని అన్నారు. దీనిని ఒప్పుకునేది లేదని, తాము దీనిపై స్పందిస్తామని, ఎవరికీ భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. శనివారం నాడు ముఖ్యమంత్రి శాసనసభలో మాట్లాడుతూ సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయని అన్నారు. తాను ఊరిలో సొంత ఇంటిలో పుట్టానని, అప్పుడు తమ ఊరిలో ఆస్పత్రి కూడా లేదని, ఆ రోజుల్లో జనన ధృవీకరణ పత్రాలు లేవని, అయ్యగారు వచ్చి జన్మ నామం రాయించేవారని, పేరు రాస్తే అదే ధృవీకరణ పత్రమని, అలాంటి పత్రం తన వద్ద ఇప్పటికీ భద్రంగానే ఉందని, అయితే దానిపై ఎలాంటి స్టాంపులు ఉండవని కేసీఆర్ పేర్కొన్నారు. ఇపుడు తనను నువ్వెవరు అని ప్రశ్నిస్తే పత్రాలు ఎక్కడ నుండి తీసుకురావాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తనకే పత్రాలు లేకపోతే, తన తండ్రి సర్ట్ఫికెట్ తెమ్మంటే ఎవరైనా ఎలా తెస్తారని ఆయన నిలదీశారు. ఎన్నో భూములు, సొంత ఇల్లు ఉన్న తమకే సర్ట్ఫికెట్లు లేకపోతే ఎస్సీలు, ఎస్టీలకు ఎక్కడి నుండి సర్ట్ఫికెట్లు వస్తాయని ఆయన ప్రశ్నించారు. సీఏఏ బిల్లును తాము పార్లమెంటులో వ్యతిరేకించామని, మంత్రివర్గ తీర్మానం చేసి తమ విధానం ఏమిటో చెప్పామని, శాసనసభలో కూడా దీనిపై చర్చ జరగాల్సిందేనని అన్నారు. మన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా అన్నది వేరే విషయమని అన్నారు. దేశాన్ని కుదిపేస్తున్న ఈ అంశంపై శాసనసభలో మాత్రం చర్చించాల్సి ఉందని పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అల్లర్లలో సుమారు 40 మందికి పైగా ప్రజలు చనిపోయారని, మన రాష్ట్ర ప్రజల మనోభావాలు, వారి ఆలోచనలను కేంద్రానికి తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. సీఏఏపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కోరినట్టు ప్రత్యేకంగా చర్చ జరపాలని, అందులో సభ్యులు అంతా మాట్లాడాలని, వాటిని ప్రజలే చూసి తెలుసుకుంటారని చెప్పారు. తమ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు, నిశ్చితాభిప్రాయాలు, విధానాలు ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.