తెలంగాణ
సైకో శ్రీనివాస్‌రెడ్డిని ఉరి తీసేవరకు పండుగలు చేసుకోం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బొమ్మలరామారం, మార్చి 9: ముగ్గురు బాలికల హత్యాచార నిందితుడు సైకో శ్రీనివాస్‌రెడ్డిని ఉరితీసేంత వరకు పండుగలను నిర్వహించుకోబోమని భువనగిరి జిల్లా బొమ్మలురామారం మండలం హాజీపూర్ గ్రామ బాధిత కుటుంబాలు తెలిపాయ. సోమవారం హోలీ పండుగను నిర్వహించుకోని హత్యాచారానికి గురైన శ్రావణి, కల్పన, మనీషాల తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు పాముల నర్సింహ్మ, తుంగరి నందం, తిప్పరబోయిన మల్లేశం మాట్లాడుతూ మర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్షవిధిస్తూ కోర్టు ఇచ్చిందని, అయతే ఆ తీర్పును అమలుచేసిననాడే తమకు నిజమైన పండుగని తెలిపారు. అంతవరకు అన్ని పండుగలకు దూరంగా ఉంటామన్నారు. సైకో శ్రీనివాస్‌రెడ్డిని ఉరితీసిననాడే తమ బిడ్డల ఆత్మకు శాంతి చేకూరుతుందని అన్నారు. వారికి గ్రామస్తులు మద్దతు తెలియజేస్తూ హోలీపండుగకు దూరంగా ఉన్నారు.