తెలంగాణ

పర్యాటక రాష్ట్రంగా తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: తెలంగాణను పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దడానికా ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో తెరాస సభ్యుడు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ వరంగల్ జిల్లాల్లో రామప్ప దేవాలయాన్ని‘యునెస్కో’ గుర్తింపు కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఏమేరకు ఫలించాయో చెప్పాలని మంత్రికి సూచించారు.
అందుకు మంత్రి సమాధానం చెబుతూ ప్రకృతి అందాలను ముద్దాడుతున్నట్లుగా రామప్ప దేవాలయ ప్రాంతాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ మాస్టర్‌ప్లాన్‌ను తీసుకువస్తుందన్నారు. దేవాలయ సమీపంలో ఉన్న చెరువు దాదాపు 27 ఎకరాల విస్ర్తిర్ణం ఉందన్నారు. ఈ చెరువును నీటితో నింపడానికి గోదావరి నీటిని తరలిస్తున్నామన్నారు. రామప్ప దేవాలయాన్ని సందర్శంచడానకి విదేశీయులు వస్తున్నారని, అందుకు అక్కడ పర్యాటకులను ఆకర్శించడానికి ఐలాండ్‌తో పాటు ఆడిటోరియం నిర్మాణాలకు ప్రభుత్వం నిధుల కొరత లేకుండా చూస్తుందన్నారు.
రామప్పలో శిల్ప కళాశాలను ఏర్పాటు చేసే ఆలోచన ఉందా అంటూ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి మరో ప్రశ్నవేశారు. దీనికి మంత్రి శిల్ప కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వ త్వరలో ప్రకటన చేస్తుందన్నారు. రామప్ప దేవాలయాన్ని ఆధ్యాత్మికతో పాటు ధ్యాన కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఒక్క రామప్ప దేవాలయానే్న కాకుండా ప్రతి జిల్లాల్లో ఉన్న ప్రాచీన కట్టడాలను మరింత రూపుదిద్దడానికి ప్రణాళికలు తయారు చేయాలని సూచించారన్నారు. ఖమ్మ జిల్లాలో భద్రాది, కినె్నర, నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌ను బుద్దవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. గోదావరి నదికి సమాంతరంగా ఉన్న చెరువులను నీటితోనింపి అక్కడ బోట్లను ఏర్పాటు చేస్తామన్నారు.
కాళేశ్వరం, యాదాద్రిని వేగవంతంగా అభివృద్ధి చేస్తున్నామమని మంత్రి గుర్తు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కోయిల్‌సాగర్, సోమశిల, శ్రీశైలం, లక్కవరం, బొగద జలపాతాలు, తాడ్వాయి మేడారంలో భక్తుల కోసం విశ్రాంతి గదులు, హాటళ్లు నిర్మాణాలు చేపడతామన్నారు. రాచకొండ, అనంతగిరి అభివృద్ధి చేయాలని సభ్యుడు కర్నే ప్రభాకర్ సూచించారు. మెదక్‌లో ప్రాచీన చర్చిని సందర్శంచడానికి అంతర్జాతీయ పర్యాటకులు వస్తున్నారని, వాటిని మరింత అభివృద్ధి చేస్తే అంతర్జాతీయ సందర్శకులు రావడానికా అవకాశం ఉందని సభ్యుడు రాజేశ్వర్‌రావు సూచించారు. హైదరాబాద్ చార్‌మీనార్‌తో పాటు కుదిప్‌షా సమాదులను సైతం సందర్శంచడానకి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని మంత్రి సభ్యులకు సూచించారు.