తెలంగాణ

అభివృద్ధి పనులు వేగవంతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15:రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లోని పద్దులకు కేటాయించిన నిధులను త్వరితగతిగా విడుదల చేసి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికార పార్టీ తెరాస ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి సూచించారు. ఆదివారం శాసనసభ సమావేశాల్లో బడ్జెట్ పద్దులపై తెరాస సభ్యులు మాట్లాడారు. దేశ, రాష్ట్రంలో ఆర్థిక మాద్యం నెలకొన్నప్పటికీ బడ్జెట్‌లో నిధులకు ఎలాంటి కోతలు లేకుండా ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని తెరాస ఎమ్మెల్యేలు కొనియాడారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీతారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కార్మిక- ఉపాధికి కేటాయించిన నిధులను సకాలంలో ఖర్చు చేస్తే సంబంధింత రంగాల్లో ఉన్న కార్మికుల బతుకులు బాగుపడతాయన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా వేలాది మంది యువతకు ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రా వెంకట వీరయ్య మాట్లాడుతూ విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలంటే పర్యవేక్షించడానికి మండల విద్యాశాఖ అధికారును తక్షణ నియమించాలన్నారు. ఎంఈఓలు లేకపోవడంతో విద్య నిర్లక్ష్యానికి గురైతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా వాలంటర్లను తొలగించడంతో చదువుకు కొరత ఏర్పడిందన్నారు. గ్రామీణ ప్రాంతల్లో కొత్త పాఠశాలలు నిర్మాంచడానికి ఎన్‌ఆర్‌ఐలు ముందుకు వస్తున్నారన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు లేకపోవడం బాలికలు అనారోగ్యానికి గురైతున్నారని ఆయన గుర్తు చేశారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ నారాయణపేటను జిల్లాగా ప్రకటించినా అక్కడ వౌళిక వసతులు లేవన్నారు. జిల్లా కోర్టు లేకపోవడంతో పొరుగు జిల్లా కోర్టుకు వెళ్ళాల్సి వస్తోందన్నారు. కుత్బూల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధికి రూ.50వేల కోట్ల ఖర్చు చేయడానకి ప్రణాళికలకు రూపకల్పణ చేయడం పట్ల ఆయన ప్రభుత్వాన్నా అభినందించారు. నగరంలో మంచినీటి సౌకర్యం మెరుగుపర్చడానికి యుద్ధప్రాతిపదికను పనులు చేపట్టాలన్నారు. మరో ఎమ్మెల్యే విద్యాసాగర్ మాట్లాడుతూ రాష్ట్రంలో గుడి,బడి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వేగవంతంగా నిధులు ఖర్చు చేస్తోందన్నారు. పాఠశాలల్లో వసతుల కొరతను తీర్చాలన్నారు.
ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ అడవులు, పర్యావరణం అంశాలపై మాట్లాడుతూ తెలంగాణలో అడవులను విస్తరింపచేయడానకి హరితహారం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అడవులు అభివృద్ది చెందితే పర్యావరణం సమతుల్యం వస్తుందన్నారు. పోడు భూములను అభివృద్ధి చెయాల్సిన అవసరం ఉందన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ప్రైవేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూళ్లు చేయడాన్ని ప్రభుత్వం అరికట్టాలని ఆయన సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రుల తీరు దారుణంగా ఉందని వాటిని నియంత్రించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్న నిధులు వెనుకబడిన వర్గాలకు నేరుగా చేరుతున్నాయన్నారు. దీంతో ఆయా వర్గాల్లో వెలుగు నింపుతోందన్నారు.