తెలంగాణ

దేవాలయాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: వివిధ పద్దులకు శాసనసభ ఆదివారం ఆమోదం తెలిపింది. విద్య, ఆబ్కారీ, పర్యాటక, కళలు, సంస్కృతి, వైద్యం-ఆరోగ్యం, అటవీ, పర్యావరణ, పురపాలక, పట్టణాభివృద్ధి, సమాచార, సాంకేతిక రంగం, ప్రభుత్వ రంగ సంస్థలు, నీటిపారుదల, గవర్నర్, మంత్రిమండలి, సమాచారం, పౌరసంబంధాలు, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, రోడ్లు-్భవనాలు, ఇంధన, ఆర్థిక, ప్రణాళిక, గణాంక తదితర శాఖలకు సంబంధించిన పద్దులను మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. దేవాలయాల అభివృద్ధి, పుణ్యక్షేత్రాల్లో భక్తుల సౌకర్యాలు, తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. యాదాద్రి ఆలయానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. వేములవాడ ఆలయానికి ఇప్పటి వరకు 60 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. భద్రాచలం సీతారామ చంద్రస్వామి ఆలయానికి 50 కోట్లు, బాసర సరస్వతీ ఆలయానికి 50 కోట్ల రూపాయలు, ఇతర దేవాలయాల కోసం 50 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. 1,427 దేవాలయాల నిర్మాణం, పునర్మిర్మాణం కోసం సర్వశ్రేయోనిధి నుండి 287 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. ధూపదీప నైవేద్యాలకోసం 3,645 ఆలయాలకు నెలకు 6000 రూపాయల చొప్పున ఇస్తున్నామని తెలిపారు. దేవాదాయ శాఖకు 2020-21 బడ్జెట్‌లో 185 కోట్ల రూపాయలను ప్రతిపాదించామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ఈటల రాజేందర్ తదితరులు తమ తమ శాఖలకు సంబంధించి మాట్లాడారు.