తెలంగాణ

14 కోట్ల మొక్కలు నాటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 23 : తెలంగాణ రాష్ట్రంలో హరితహారం కింద శనివారం వరకు 14 కోట్ల మొక్కలను నాటామని మంత్రి జోగురామన్న తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేస్తూ, హరితహారం కార్యక్రమం యుద్ధప్రాతిపదికపై కొనసాగుతోందని, ప్రభుత్వ సంస్థలతో పాటు, ప్రైవేట్ సంస్థలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా అంటే 2.27 కోట్ల మొక్కలు నాటినట్టు వివరించారు. హరితహారం ఒక ఉద్యమంగా కొనసాగుతోందని, ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాలు, కార్యక్రమాల్లో ఈ కార్యక్రమానికి లభించిన స్పందన అమోఘంగా ఉందన్నారు. అడవులు, వ్యవసాయ, ఉద్యాన, జిహెచ్‌ఎంసి తదితర అన్ని విభాగాలు ఈ కార్యక్రమంలో కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు.