తెలంగాణ

నిరాడంబరంగా పంచాంగ శ్రవణం, నవమి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: ఉగాది వేడుకలను ప్రభుత్వం నిర్వహించడం అనాదిగా వస్తోందని, అయితే ప్రాణాంతక కరోనా వైరస్ కట్టడి ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ఏడాది ఉగాది వేడుకలను నిరాడంబరంగగా నిర్వహిస్తున్నట్లు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. భద్రాద్రిలో జరిగే శ్రీరామనవమి వేడుకలను కూడా భక్తులకు అనుమతి లేదన్నారు. ఉగాది పంచాంగశ్రవణం, శ్రీరామనవమి వేడుకలు, ఆలయాల్లో దర్శనాల రద్దుపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శనివారం దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారితో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా సీఏం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో ప్రముఖ పుణ్య క్షేత్రాలు, ఆలయాల్లో దర్శనాలను రద్దు చేశామన్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఉగాది వేడుకలతో పాటు సామూహిక శ్రీరామనవమి వేడుకలను నిర్వహించవద్దని కేసీఆర్ ఆదేశించారన్నారు. ఎటువంటి ఆడంబరాలకు తావులేకుండా పంచాంగ శ్రవణం శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెల 25వ తేదీన ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాదాయశాఖ కార్యాలయంలోనే ఉదయం 10 గంటలకు పంచాంగం శ్రవణ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండి లైవ్ ద్వారా టీవీల్లో ఉగాది పంచాంగ శ్రవణాన్ని వీక్షించాలని కోరారు. భద్రాద్రిలో యథావిధిగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్సాతమని, కేవలం ఆలయ ప్రాంగణంలో మాత్రమే శ్రీరామనవమి వేడుకలు జరుగుతాయన్నారు. బహిరంగ వేడుకలు నిర్వహించరాదని ప్రజలను కోరారు. ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తామని చెప్పారు.
ఈసారి కల్యాణ ఆహ్వాన పత్రికలు కూడా ముద్రించలేదన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా భక్తులు, పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారికి డోర్ డెలివరీ ద్వారా శ్రీసీతారాముల స్వామి వారి తలంబ్రాలు పంపిస్తామన్నారు. మరోవైపు కరోనా వ్యాప్తి నివారణకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సుదర్శన, మృత్యుంజయ హోమాలను నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, అదనపు కమిషనర్ శ్రీనివాసరావు, జాయింట్ కమిషనర్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
ఉగాది పంచాంగ శ్రవణం, శ్రీరామనవమి వేడుకలు, ఆలయాల్లో దర్శనాల రద్దుపై శనివారం
*చిత్రం...దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి