తెలంగాణ

కరోనా నివారణకు కలిసికట్టుగా పనిచేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపుమేరకు జనతా కర్ఫ్యూను ప్రతి ఒక్కరు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 14 గంటల పాటు పూర్తిగా ఇళ్లలో ఉండి పాటించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని పెద్ద విపత్తులో పడేసిందన్నారు. మన దేశంలో కూడా కరోనా వైరస్ రోజు రోజుకు విస్తరిస్తోందన్నారు. తెలంగాణలో ఇప్పటికే 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడం ఆందోళన కలిగించే అంశమన్నారు. ప్రధానంగా విదేశీయులు, ఇతర దేశాల నుంచి వచ్చిన తెలంగాణ వాసులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తెలుస్తోందన్నారు. 14 గంటల పాటు ఇళ్లలో ఉండి కరోనా వైసర్ విస్తరించకుండా అందరూ సహకరించాలన్నారు. ఇది పూర్తిగా రాజకీయాలకు, అన్నింటికీ అతీతంగా ప్రతి ఒక్క పౌరుడు విధంగా నిర్వర్తించాలన్నారు.
అలాగే కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించేందుకు అది విస్తరించకుండా ప్రభుత్వం అన్ని రకాల వ్యాపారాలు, పాఠశాలలు, రవాణా, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు విరామం ఇచ్చినట్లు చెప్పారు. దీని వల్ల దినసరి కూలీలు చేసుకునే వారు, రోజూవారీ వ్యాపారాలు చేసుకునే వారు,పేదలు, మధ్యతరగతి ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ వైరస్‌కు చికిత్స లేదని, నివారణ ఒక్కటే మార్గమన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని రకాల మందులు, సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఆయన రాష్ట్రప్రభుత్వాన్ని డిమాంటడ్‌చేశారు,. నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందుబాటులో ఉంలన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కరోనా నివారణ కోసం సమాజానికి అవసరమైన సేవలు అందించాలన్నారు. కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పేదలకు, మధ్యతరగతి వారికి సహాయ సహకారాలు అందించాలన్నారు. కరోనాతో ప్రజలు ఆందోళన చెందరాదని, స్వీయ నియంత్రణ, పరిశుభ్రత, బయట తిరగకుండా ఉండడం లాంటివి చేస్తూ కరోనా నివారణకు ప్రజలంతా సహకరించాలన్నారు
*చిత్రం... పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి.