తెలంగాణ

సంఘీభావ సంకేతం అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కరోనా మహమ్మారి వంటి ఆపద సమయంలో సైతం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి సమాజం కోసం విధులు నిర్వహిస్తున్న వారికి సంఘీభావంగా చప్పట్లతో సంఘీభావం తెలిపిన కార్యక్రమం తెలంగాణలో మహా అద్భుతంగా జరిగింది. గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలుకొని ప్రగతి భవన్ నుంచి పల్లెటూరి వరకు వాడవాడలో జరిగిన సంఘీభావ సంకేతానికి ప్రతి పౌరుడు స్పందించిన తీరు అద్వితీయం. కనీవినీ ఎరగని రీతిలో జరిగిన జనతా కర్ఫ్యూతో చీమ చిటుక్కుమనని నిశ్శబ్దం ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఒక్కసారిగా చప్పట్లతో మార్మోగిపోయాయి. అత్యవసర సమయంలో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది, పారిశుధ్యం, విద్యుత్, మంచినీటి సరఫరా, మీడియా వంటి రంగాల అత్యవసర సేవలకు సంఘీభావంగా చప్పట్లు కొట్టి సంఘీభావం తెలపాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి చప్ప ట్లు కొట్టగా, రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై తన కుటుంబ సభ్యులు చప్పట్లతో సంఘీభావం తెలిపారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును రాష్ట్రంలో ప్రతి పౌరుడు సంఘీభావ సంకేతాన్ని విజయవంతం చేయాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు ప్రతి ఒక్కరూ స్పందించారు. హైదరాబాద్ నగరంలోనే కాకుండా మారుమూల పల్లె వరకు ప్రజలు చప్పట్లు కొట్టి తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంఘీభావ సంకేతం చాలా గొప్పగా జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. ప్రజలు ఎవరూ బయటికి రాకుండానే తమ ఇళ్ల వద్ద నుంచే చప్పట్లు కొట్టిన తీరు దేశంలో మరెక్కడా లేనివిధంగా జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ ప్రజలకు సమాజం పట్ల ఉన్న స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచిందని అభినందించారు.

*చిత్రాలు.. జనతా కర్ఫ్యూ సందర్భంగా ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు చప్పట్లతో సంఘీభావ సంకేతం తెలుపుతున్న గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, పలువురు మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు