తెలంగాణ

దండం పెడతాం.. ప్లీజ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: జనతా కర్ఫ్యూ అమలులో ఉన్నా రోడ్డుపైకి వస్తున్న వాహనదారులు, వ్యక్తులకు హైదరాబాద్ పోలీసులు వినూత్న రీతిలో బుద్ధి చెప్పారు. వారి బాధ్యతను గుర్తుకు వచ్చేలా వ్యవహరిస్తున్నారు. పోలీసుల తీరు మర్యాదపూర్వకంగానే ఉన్నా, అది మాత్రం వాహనదారులకు చెంపపెట్టులా అనిపిస్తోంది. జనతా కర్ఫ్యూ సందర్భంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి, అంతా ఇళ్లలోనే ఉన్న సమయం, అయినా రోడ్లపై తిరుగుతూ కనిపించిన వారికి నగర ట్రాఫిక్ పోలీసులు, కూడళ్లలో ఉన్న సాధారణ పోలీసులు వారిని ఆపి దండం పెడుతున్నారు. ఈ ఫోటోలను హైదరాబాద్ పోలీసులు ట్విట్టర్‌లో షేర్ చేశారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు దేశమంతా ఏకమై కర్ఫ్యూ పాటిస్తున్న తరుణంలో రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు బాగా బుద్ధి చెప్పారని సెటిజన్లు కామెంట్లు చేశారు.