తెలంగాణ

వనపర్తి జిల్లాను వణికిస్తున్న డెంగ్యూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, ఏప్రిల్ 13: ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తుండగా వనపర్తి జిల్లాలో మాత్రం డెంగ్యూ జ్వరాలు వ్యాపించి అటు ప్రజలను, అధికారులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లాలోని అమరచింత మున్సిపాల్టీతో పాటు వనపర్తి రామ్‌నగర్ కాలనీలో వారం రోజులుగా డెంగ్యూ జ్వరాలు విస్తరించి సుమారు 40 మందికి వ్యాపించడంతో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష, జిల్లా ఎస్పీ అపూర్వారావుతో పాటు మున్సిఫల్ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రధానంగా జిల్లాలోని అమరచింత మండలంలో పెద్ద చెరువు కాలువ మురుగుగా ఏర్పడి శ్రీకృష్ణనగర్( గొల్ల గేరి) మీదుగా పోతుండటంతో ఆ చుట్టుపక్కల దోమలు విపరీతంగా ఉండటంతో డెంగ్యూ జ్వరాలు ప్రబలినట్టు గుర్తించిన అధికారులు పారిశుద్ధ్య చర్యలతో పాటు ప్రజల్లో అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అమరచింత మున్సిపాల్టీలో శ్రీకృష్ణ నగర్‌తో పాటు బీసీ కాలనీ, సంతోష్‌నగర్ తదితర కాలనీల్లో ఈ వ్యాధి ప్రబలి అస్వస్థతకు గురికావడంతో పాటు అరవింద్ (14) అనే చిన్నారి మృతి చెందాడు. దీంతో తేరుకున్న అధికారులు ఆయా కాలనీల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. అలాగే జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష, ఎస్పీ అపూర్వారావు అధికార యంత్రాంగాన్ని తీసుకొని వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు నీటి నిలువలను పారబోయించారు. అలాగే వనపర్తి జిల్లా కేంద్రంలోని రామ్‌నగర్ కాలనీలో జిల్లా కలెక్టర్ పర్యటించి సుమారు మూడు గంటల పాటు అక్కడే ఉండి పారిశుద్ధ్య పనులను చేయించారు. అమరచింత, వనపర్తి మున్సిపాల్టీల్లో అస్వస్థతకు గురైన వారు ఇద్దరు మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మిగిలిన వారు వనపర్తి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికి సుమారు 11 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు అధికారులు తెలిపారు. వనపర్తిలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడంతో ధైర్యంగా ఉన్న అధికారులకు జిల్లాలో డెంగ్యూవ్యాధి ప్రబలుతుండటంతో ఆందోళన చెందుతున్నారు.