తెలంగాణ

వానొచ్చె.. వరదొచ్చె..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 26: అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. గడిచిన 24 గంటలుగా ఉత్తర తెలంగాణలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా వరంగల్ జిల్లా నర్మెట్టలో 12 సెమీ వర్షపాతం నమోదైంది. అలాగే కరీంనగర్ జిల్లా భీమరదేవరపల్లిలో 10 సెమీ, వరంగల్ జిల్లా ధర్మసాగర్, హసన్‌పర్తిలో 9 సెమీ వర్షపాతం నమోదుకాగా, ఇదే జిల్లాలోని పాలకుర్తి, నల్లబెల్లి, హన్మకొండ, జనగామలో 8 సెమీ వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లా మోర్తద్, బాల్కొండ, బాన్స్‌వాడ, కరీంనగర్ జిల్లా రామగుండం, ఆదిలాబాద్ జిల్లా ఆసీఫాబాద్‌లో 7 సెమీ వర్షపాతం నమోదైంది. నల్లగొండ జిల్లా భువనగిరి, నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్లు, ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో 6 సెమీ వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ వైకె రెడ్డి తెలిపారు. గడిచిన 24 గంటల నుంచి వరంగల్ జిల్లా హన్మకొండలో 78 మిమీ, రామగుండంలో 68 మిమీ, హైదరాబాద్‌లో 49 మిమీ, ఖమ్మంలో 21 మిమీ, ఆదిలాబాద్, నల్లగొండలో 14 మిమీ, మెదక్‌లో 13 మిమీ, నిజామాబాద్‌లో 12 మిమీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. కృష్ణానది ఎగువ, పరీవాహక ప్రాంతంలో కురుస్తోన్న వర్షాలవల్ల జూరాల ప్రాజెక్టులోకి వరద భారీగా వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు సామర్థ్యం 9.657 టిఎంసి కాగా మంగళవారానికి 9.65 టిఎంసి వరకు నీరు వచ్చి చేరడంతో, జలాశయం పూర్తిస్థాయిలో నిండింది. ఎగువనున్న నారాయణపూర్ డ్యామ్ గేట్లు తెరవడంతో జూరాలలోకి 15 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. ఇప్పటికే జూరాల జలాశయం నిండటంతో దిగువకు 10,695 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరడంతో జలాశయంలో నీటిమట్టం 801.8 అడుగులకు చేరుకుంది. దీని పూర్తి నీటి సామర్థ్యం 885 అడుగులు.
chitram..
భారీ వర్షానికి నీటి మడుగులైన హైదరాబాద్ రహదారులు