రాష్ట్రీయం

సౌర విద్యుత్‌కు ఏపిలో గ్లోబల్ హబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 26: వచ్చే ఏడాది జూలై నాటికి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు రంగం సిద్ధమైంది. సౌరవిద్యుత్ రంగంలో గ్లోబల్ హబ్ ఏర్పాటు చేసేందుకు అనేక విదేశీ, దేశీయ సంస్థలు ముందుకు వచ్చాయి. కేంద్రప్రభుత్వ ఆధీనంలోని నవరత్న సంస్థల్లో ఒకటైన నైవేలీ లిగ్నైట్ కార్పోరేషన్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది.
రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో 30 వేల కోట్ల రూపాయలతో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క ఈ మూడు జిల్లాల్లోనే 2017 జూలై నాటికి నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. ఎన్‌టిపిసి ద్వారా అనంతపురం జిల్లాలో సౌర విద్యుత్ మొదటి దశ కింద 250 మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చారు.
రికార్డు స్ధాయిలో దీనిని పది నెలల్లో అభివృద్ధి చేసినట్లు ఏపి ట్రాన్స్‌కో సిఎండి విజయానంద్ చెప్పారు. రెండవ దశలో 2017 మార్చి నాటికి 750 మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తేనున్నారు. ఇదే జిల్లా తాడిపత్రిలో ఏపి జెన్కో ఆధ్వర్యంలో 500 మెగావాట్ల సౌర విద్యుత్ ఏర్పాటు కానుంది. కర్నూలు జిల్లాలవో 1000 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ పార్కును నెలకొల్పనున్నారు. ఎన్‌వివిఎల్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును ఎస్‌బి ఎనర్జీ, సన్ ఎడిషన్, అజూర్ పవర్, అదాని గ్రూపు చేపడుతున్నాయి. ఈ ఆర్ధిక సంవత్సరంలోనే ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. కడప జిల్లా గాలివీడులో సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా 500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును చేపట్టనుంది. ఇదే జిల్లా మైలవరం ఎంపిటిసిపై సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 1500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తారు.
ఈ రెండు ప్రాజెక్టులు వచ్చే ఏడాది ఆగస్టు నాటికి ఉత్పత్తిని ప్రారంభిస్తాయని విజయానంద్ చెప్పారు. దేశంలోనే మొదటి సారిగా వంద మెగావాట్ల సామర్ధ్యం ఉన్న సౌర విద్యుత్ నిల్వ యూనిట్లను కడప జిల్లాలో ప్రయోగాత్మకంగా నెలకొల్పనున్నారు. సౌర విద్యుత్ పంపుసెట్ల పథకంలో భాగంగా 5013 పంపుసెట్లు బిగించి దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది.