తెలంగాణ

ప్రజలను ఒప్పిస్తాం.. ప్రాజెక్టులు కడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 26: ప్రజలను ఒప్పించి భూసేకరణ జరుపుతాం, ఎవరు అడ్డుకున్నా ప్రాజెక్టులు కట్టి తీరుతామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టులను అడ్డుకోవడానికి విపక్షాలు నానా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. మొదటి నుంచి ప్రజలు ఒకవైపు ఉంటే ప్రతిపక్షాలు మరోవైపు ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేలా ప్రతిపక్షాలు కోడిగుడ్డు మీద ఈకలు పీకేలా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయమంటే ఒక పార్టీ పారిపోయిందని, మరోపార్టీ జిరాక్స్‌లు పంపించి మోసం చేసిందని ధ్వజమెత్తారు.
రైతులు కోరుకున్నట్టు పరిహారం ఇస్తామని సిఎం కెసిఆర్ చెప్పినా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాల అసలు రంగు తెలిసిందని, అందువల్లనే రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని చెప్పారు. విపక్షాలు ఏటిగడ్డకిష్టాపూర్‌లో ఎక్కడైతే ఆందోళన చేశారో అదే టెంట్ కింద ఇప్పుడు రైతులు ముందుకు వచ్చి భూములు ఇస్తున్నారని చెప్పారు. మీ హయాంలో అక్రమ ప్రాజెక్టులైన పోతిరెడ్డిపాడు, పులిచింతలను అపలేకపోయారని, ఆంధ్ర ప్రాజెక్టులను పూర్తిచేసి తెలంగాణ ప్రాజెక్టులను పట్టించుకోకుంటే ఆనాడు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. మీరు చేసిన పాపాల వల్లనే ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని , రాష్ట్రం పచ్చగా ఉండాలంటే సిఎం కెసిఆర్ రాత్రింబవళ్లు శ్రమించి, ప్రాజెక్టులను రీడిజైన్ చేసి కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని సంకల్పించారని తెలిపారు. కాంగ్రెస్, టిడిపి, సిపిఎం అధికారంలో ఉన్న చోట ఒక మాట అధికారంలో లేని చోట మరో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. దేశంలోనే అత్యధిక గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రాజెక్టులను కర్నాటక కడుతున్నారని అక్కడ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉందని అన్నారు.
టిడిపి కేంద్ర మంత్రులు, ఎంపిలు భూ సేకరణ చట్టం 2013 రద్దు చేయాలని తీర్మానం చేస్తారు, ఇక్కడేమో అమలు చేయాలని అంటారని ప్రశ్నించారు. సచివాలయం, అసెంబ్లీ వంటి వాటికి ఆంధ్ర రాజధానికి ఐదువందల ఎకరాలు సరిపోతుందని మరి 54వేల ఎకరాలు ఎందుకు సేకరిస్తున్నారని ప్రశ్నించారు. రైతుల నుంచి బలవంతంగా ఆంధ్రలో లక్షలాది ఎకరాలు లాక్కుంటున్నారని కానీ ఇక్కడ టిడిపి నాయకులు మాత్రం ప్రాజెక్టులు నిర్మించవద్దని డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు. జివో123 లేదా భూ సేకరణ చట్టం 2013 ప్రజలు ఎలా కోరుకుంటే అలా భూ సేకరణ చేయనున్నట్టు హరీశ్‌రావు తెలిపారు. ముంపు బాధితులను ఒప్పించి వారు మెచ్చుకునే విధంగా పరిహారం చెల్లిస్తామని అన్నారు.